(1).webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మిథిలేష్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చిన రెండో రోజే రూ.15 లక్షల బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చేశాడు. అతను డబ్బు పట్టుకుని వెళ్తుంటే త్రిగుణ్ "రేయ్ అది నా డబ్బురా" అని అరవడం..ముఖేష్ గౌడ్ "విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి కట్ చేసి ఇస్తారు.. ఒక్క రోజు ఉండి 15 లక్షలు తీసుకెళ్లడం ఏంటని ఫీల్ అయ్యారు. దీనిపై బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ శివాజీ మిథిలేష్ ని సూటిగా నిలదీశాడు.
ప్రతి సీజన్ లో ఫినాలే వారంలోనే ఈ సూట్ కేస్ డీల్ వస్తుంది. కానీ ఈసారి మూడో వారంలోనే తీసుకొచ్చేశారు బిగ్ బాస్. గతంలో సీజన్ 4 లో సొహైల్ రూ.25 లక్షలు, ఆ తర్వాత శ్రీహాన్, యావర్, అరియానా కూడా లక్షలు తీసుకుని మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే వాళ్లంతా ఫినాలే వరకు ఆడి అప్పుడు తీసుకున్నారు. కానీ మిథిలేష్ మాత్రం రెండో రోజే 15 లక్షలు కొట్టేయడంతో కంటెస్టెంట్స్ అందరు షాక్ అయ్యారు.
రామకృష్ణను టాస్క్ లో ఓడించి హౌస్ లోకి వచ్చి, ఇలా వెళ్లిపోవడం ఎందుకని శివాజీ వెటకారంగా అడిగిన ప్రశ్నలకు మిథిలేష్ కూల్ గా బదులిచ్చాడు. ఈ వారం థీమ్ టెంప్టేషన్ అని తెలిసి ఆఫర్ వస్తుందని గెస్ చేశా కానీ 15 లక్షలు అనుకోలేదు. ఇది విన్నర్ అమౌంట్ నుంచి తగ్గిస్తారు కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశపడటం కరెక్ట్ కాదని 15 లక్షలకే ఓకే చెప్పా. నేను ఊరికే రాలేదు.. అగ్నిపరీక్షలో, వైల్డ్ కార్డ్ టాస్క్ లో గట్టిగానే ఫైట్ చేసి వచ్చానని మిథిలేష్ చెప్పాడు.
తనది స్మార్ట్ గేమ్ అంటూ మిథిలేష్ మరో సంచలన కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హిస్టరీలో 50 మందికి పైగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు.. టాప్- 5 కి వెళ్లింది ఒకరిద్దరే. నేను ఉన్నా కూడా 6th లేదా 7th ప్లేస్ లోనే ఉండేవాడిని. అందుకే ఇది నా స్మార్ట్ ప్లే. ఇప్పుడు తప్పు అనిపించినా కొన్ని వారాల తర్వాత అందరికీ నా నిర్ణయం కరెక్ట్ అని అర్థమవుతుందంటూ మిథిలేష్ అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకొచ్చావ్ హౌస్ లోకి అని శివాజీ అడుగగా స్క్రీన్ స్పేస్ కోసమని , ఫేమస్ అవ్వాలని వచ్చానంటూ బదులిచ్చాడు మిథిలేష్.






