Home

»

Tv News

BiggBoss 10 Telugu: జాన్సీని నామినేట్ చేసిన దేబ్జానీ, నీతూ.. మేకప్ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న జాన్సీ!

Oct 27, 2026 8:52AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో నామినేషన్స్ జాన్సీ చుట్టూ తిరిగాయి. దేబ్జానీ జాన్సీని నామినేట్ చేసింది. ఆమె గేమ్ ప్లే కనిపించడం లేదని రీజన్ చెప్పింది. అయితే ఇదే నిజానికి జాన్సీ తనకు పోటీగా మారుతుందన్న లెక్కతో చేసిన నామినేషన్ అని హౌస్ లో చర్చ మొదలైంది.

జాన్సీ వీకెండ్స్ లో మేకప్ కోసం దేబ్జానీని హెల్ప్ అడుగుతుందని పాయింట్ లేపడంతో జాన్సీ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని, మేకప్ గురించి తనకు పెద్దగా తెలియదని, అందుకే అడిగానని ఝాన్సీ కన్నీళ్లతో చెప్పింది. ఈ విషయంలో ముఖేష్, వర్షిణి జాన్సీకి సపోర్ట్ గా నిలబడ్డారు. వంశీ కూడా జాన్సీకి అండగా నిలిచి, డాగర్ టాస్క్ లో ఆమె ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుందని గుర్తు చేశాడు.

ఇక నీతూ కూడా జాన్సీని నామినేట్ చేసింది. జాన్సీకి ఇండివిజువల్ ఐడెంటిటీ లేదని నీతూ ఆరోపించింది. కానీ జాన్సీ టాస్క్ లలో ఎప్పుడూ డిటర్మినేషన్ తో ఆడుతూనే ఉంది. నీతూ చెప్పిన రీజన్ వినడానికి కన్విన్సింగ్ గా లేదని, కేవలం నెగెటివ్ నెరేటివ్ క్రియేట్ చేయడానికే చేసిన నామినేషన్ లా ఉంది. ఇలా ఒకే రోజు ఇద్దరు సీనియర్ కంటెస్టెంట్స్ నుంచి నామినేషన్స్ రావడంతో జాన్సీ బాగా హర్ట్ అయింది. అయితే ఆమె ఎమోషనల్ స్పీచ్ తర్వాత హౌస్ మేట్స్ లో చాలా మందికి సింపథీ వచ్చింది. ఈ నామినేషన్స్ జాన్సీకి ప్లస్ అయ్యే  అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com