Home

»

Tv News

Bigg Boss 10 Double Elimination: ఫస్ట్ ఝాన్సీ ఎలిమినేషన్.. సెకెండ్ రోహిత్ ఎలిమినేషన్!

Nov 1, 2026 8:29AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ మొదలైంది. రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ ప్లేయర్ రోహిత్ ని గ్రీన్ టీమ్ లోని సభ్యులు త్రిగుణ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ ఓటింగ్స్ ప్రకారం ఎలిమినేషన్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పక్కా కన్ఫమ్ అని స్ట్రాంగ్ లీక్స్ ఉన్నాయి. 

నిన్నటి శనివారం జరిగిన ఎపిసోడ్ లో రెడ్ జోన్ లో ఉన్న వంశీ, రోహిత్, ఝన్సీ, రామకృష్ణ , సుధీర్ ల నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు. దాంతో గార్డెన్ ఏరియాలో కుండలు ఉంచి ఒక్కోక్కరిని వచ్చి పగులగొట్టమన్నాడు. అందులో నుండి వచ్చిన ఫోటోలని అక్కడ బోర్డ్ పై ఉన్న వారి పేరు కింద అంటించమనగా ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి అందరికి ఈక్వెల్ ఫోటోలు వచ్చాయి‌. 

ఇక కన్ఫెషన్ రూమ్ దగ్గరలో ఉన్న టాస్క్ రూమ్ లో మరో నాలుగు కుండలు ఉంచారు‌ దానిని కెప్టెన్ త్రిగుణ్ ని పగులగొట్టమని నాగార్జున చెప్పగా త్రిగుణ్ వెళ్ళి ఒక్కో కుండని పగులగొడతాడు. అందులో వంశీ, రామకృష్ణ, రోహిత్, సుధీర్ ఫోటోలు వస్తాయి కానీ ఝాన్సీ ఫోటో రాదు. దాంతో ఝాన్సీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేశాడు.  దాంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. 

గేమ్స్ సరిగ్గా ఆడని రామకృష్ణ, సుధీర్ లలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారని అనుకున్నారంతా కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఝాన్సీ ఎలిమినేషన్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఇక ఝాన్సీ ఎలిమినేషన్ అని అనగానే ముఖేష్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందరితో బాగుండి, గేమ్స్, టాస్క్ లు బాగా ఆడే ఝాన్సీ ఎలిమినేషన్ అవ్వడం ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. 

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కన్ఫమ్ అని చెబుతున్నారు. నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో ఝాన్సీ ఎలిమినేట్ అయింది. ‌ఇక సండే ఎపిసోడ్ లో డబుల్  ఎలిమినేషన్ గా  రోహిత్  హౌస్ నుండి బయటకు వస్తాడని, సీక్రెట్ రూమ్ కూడా ఏం లేదని వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సండే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com