.webp)
బిగ్ బాస్ సీజన్-10 లో రెడ్ బాక్స్, ఎల్లో బాక్స్, గ్రీన్ బాక్స్ లుగా కంటెస్టెంట్స్ ని విభజించాడు బిగ్ బాస్. వారిలో రెడ్ బాక్స్ లో ఉన్నవాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారని ఎల్లో బాక్స్ నుండి గ్రీన్ బాక్స్ కి వెళ్ళే వాళ్ళు ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు. ఇక దానికోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన G.O.A.T టాస్క్ లో కేవలం అమన్ మాత్రమే కాదు, మహిళల్లో ఇద్దరికి కూడా జాక్ పాట్ కొట్టింది. Yellow Level లో ఉన్నవారికి Green Level లోకి వెళ్లే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, పురుషులతో పాటు మహిళలకు కూడా సెపరేట్ గా G.O.A.T టైటిల్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో వర్షిణి మొదట్లోనే కుప్పకూలిపోయినా, దేబ్జానీ, నీతూ మాత్రం చివరి వరకు ఫైట్ చేశారు.నీతూ కూడా ఎక్కువ వెయిట్స్ మోసి మోసి చివరకు వదిలేసింది. వంశీ, దక్షి లాంటి వారు నీతూ, దేబ్జానీలకు కూడా బరువులు వేశారు. కానీ మహిళల్లో ఎక్కువ సమయం బరువు మోసింది దేబ్జానీ, నీతూలే. దీంతో బిగ్ బాస్ వారిద్దరినీ మహిళా G.O.A.T లుగా ప్రకటించాడు. వారికి కూడా 2 వారాల ఇమ్యూనిటీ ఇస్తూ గ్రీన్ జోన్ లోకి పంపించాడు.
దీంతో ఈ వారం అమన్ తో పాటు దేబ్జానీ, నీతూ ముగ్గురూ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. Red Level లో ఉన్నవారికి G.O.A.T అయ్యే అవకాశం లేదని బిగ్ బాస్ ముందే చెప్పడంతో వారు నిరాశలో ఉన్నారు. Yellow Level నుంచి Green Level కి వెళ్లిన ఈ ముగ్గురూ ఇప్పుడు హౌస్ లో సేఫ్ జోన్ లోకి వెళ్లారు.ఈ ముగ్గురికి ఇమ్యూనిటీ రావడంతో ఇంటి లెక్కలు మొత్తం మారిపోయాయి. త్రిగుణ్, శివ్, వర్షిణి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇంకా Yellow Level లోనే ఉండిపోయారు. వచ్చే వారం నామినేషన్ లో ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





.webp)
