Home

»

Tv News

Bigg Boss 10 Day 18 Captaincy Task: త్రిగుణ్ పై ఫైర్ అయిన నరేష్.. కెప్టెన్సీ కంటెండర్ షిప్ కొట్టేసిన ఝాన్సీ!

Sep 25, 2026 9:56AM

బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు హీటెక్కిస్తున్నాయి. బిగ్ బాస్ రెండు బజర్లను పెట్టి ముందుగా ఎవరు టచ్ చేస్తారో వారికి టాస్క్ ఇస్తున్నాడు. లివింగ్ ఏరియాలో నరేష్, వంశీ, సుధీర్, చరణ్, గార్డెన్ ఏరియాలో రామ్ ప్రసాద్, షాలిని, ఝాన్సీ పోటీ పడ్డారు. గార్డెన్ లో ఝాన్సీ ఫస్ట్ బజర్ కొట్టి విన్ అయింది.

 

కానీ అసలు గొడవ లివింగ్ ఏరియాలో జరిగింది. నరేష్, వంశీ ఇద్దరూ దాదాపు ఒకేసారి బజర్ కొట్టారు. అందరు నరేష్ ముందు కొట్టాడని అనుకున్నారు. కానీ సంచాలకుడుగా ఉన్న త్రిగుణ్ మాత్రం మొదట నరేష్ పేరు చెప్పి వెంటనే మాట మార్చి వంశీనే ముందుగా టచ్ చేశాడని అనౌన్స్ చేశాడు. తన నిర్ణయం తప్పు అయితే తనే పనిష్మెంట్ తీసుకుంటానని త్రిగుణ్ అనడంతో నరేష్ హర్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

ఆ తర్వాత వంశీ, ఝాన్సీకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అందులో ఝాన్సీ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా నిలవడమే కాకుండా ఫ్యామిలీ ఫోటోను కూడా గెలుచుకుంది. తనకు ఇచ్చిన ఆప్షన్స్ లో భాగంగా ఝాన్సీ నరేష్ కి టెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో నరేష్ కి వచ్చిన లెటర్ ను ముక్కలు చేసింది. తర్వాత గార్డెన్ ఏరియాలోకి బిగ్ బాస్ కావాల్సినంత ఫుడ్ పంపించాడు. కేక్స్, బర్గర్స్, చికెన్ లెగ్ పీస్ లు చూసి కంటెస్టెంట్లు అంతా ఫుల్లుగా లాగించేశారు. మీరే అన్ని సీజన్లలోకి భయస్తులు అని బిగ్ బాస్ అన్నాడు. టెంప్టేషన్ అయింది, ఇక టెన్షన్ వంతు అని చెప్పడంతో హౌస్ లో మళ్లీ టెన్షన్ మొదలైంది.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Captaincy Contender Task, Trigun, Naresh, Vamsi, Sudheer, Charan, Jhansi, Ram Prasad, Shalini]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com