Home

»

Tv News

Bigg Boss 10 Telugu Total Domination Task: డ్యాగర్స్ కోసం ఫిజికల్ ఫైట్.. శ్రిష్టికి గాయం!

Sep 29, 2026 10:04AM

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం మొత్తం టోటల్ డామినేషన్ థీమ్ నడుస్తోందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టాడు. షాలినీ, శ్రిష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ ఒక టీం గా సప్తశక్తి పేరు పెట్టుకుంటే మిగిలిన వారంతా భైరవ టీంగా ఏర్పడ్డారు. మొదటి యుద్ధంలో ఆధిపత్యం గెలిస్తే అదిరిపోయే ఆఫర్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

 

మొదటి ఆయుధంగా బిగ్ బాస్ డ్యాగర్స్ ను పంపించాడు. ఒకరి దగ్గర రెండు అంతకంటే ఎక్కువ డ్యాగర్స్ సంపాదించుకోవాలని, ఎక్కువ ఉన్నవారు ఎదుటి వారి ఆటను కూడా మార్చవచ్చని రూల్ పెట్టాడు. దీంతో టాస్క్ మొదలవ్వగానే రోహిత్, సుధీర్, రామ్ ప్రసాద్ కలిసి నరేష్ ను ఎత్తుకెళ్లి అతని కత్తిని లాక్కున్నారు. ఇది ప్రాంక్ అంటూనే ఫిజికల్ అయ్యారని నరేష్ హర్ట్ అయ్యాడు.

 

నరేష్ పై ఇలా ఫిజికల్ అవ్వడంతో అవతలి టీమ్ వెంటనే ఝాన్సీ మీద మూకుమ్మడిగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా అరుపులు, కేకలు మొదలయ్యాయి. బిగ్ బాస్ టాప్ లేచిపోతుందేమో అన్నంతగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆట ఆడుతుండగా శ్రిష్టి కాలికి గాయం కావడంతో బిగ్ బాస్ ఆటను తాత్కాలికంగా ఆపేశాడు.

 

గాయపడిన శ్రిష్టి మెడికల్ రూమ్ కి వెళ్లే ముందు తన కత్తిని షాలినీకి ఇచ్చి వెళ్లింది. ఇది తెలిసిన భైరవ టీం ఆ కత్తిని టార్గెట్ చేసింది. నరేష్ కత్తిని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఇప్పుడు శ్రిష్టి కత్తిని కూడా లాక్కోవాలని చూస్తున్నారని సప్తశక్తి టీం ఆరోపించింది. ఈ డ్యాగర్స్ టాస్క్ తోనే హౌస్ లో ఫిజికల్ ఫైట్స్ మొదలయ్యాయి.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Total Domination Theme, Saptashakti Team, Bhairava Team, Dagger Task, Rohith, Sudheer, Ram Prasad, Srishti]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com