
బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారంలో కెప్టెన్ గా ఉన్న అపూర్వకు మొదటి రోజే పెద్ద తలనొప్పి మొదలైంది. డిష్ వాష్ చేయడం, కెప్టెన్ రూమ్ ను వెకేట్ చేయడం విషయంలో ముఖేష్ తో అపూర్వకు గొడవ మొదలైంది. మీటింగ్ పెట్టి రూల్స్ పెడితేనే ఫాలో అవుతానని ముఖేష్ తెగేసి చెప్పడంతో వెంటనే అపూర్వ హౌస్ మీటింగ్ పెట్టింది. అక్కడ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది.
ఎందుకు ఇలా చులకనగా చూస్తున్నావ్.. అగౌరవపరుస్తున్నావ్, కెప్టెన్ అంటే గౌరవం లేదా అని అపూర్వ ప్రశ్నించింది. నువ్వే కెప్టెన్ కి గౌరవం ఇవ్వాలని చెప్పావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని అపూర్వ నిలదీసింది. దీనికి ముఖేష్ సైలెంట్ గా ఉండగా.. త్రిగుణ్ మాత్రం నేరుగా ఎదురుతిరిగాడు. కెప్టెన్ అపూర్వ అని కచ్చితంగా పిలవాలని అపూర్వ రూల్ పెడితే.. నేను పిలవను, ఏం చేసుకుంటావో చేసుకోమని త్రిగుణ్ అన్నాడు.
ఈ కెప్టెన్సీ గొడవల నడుమ అపూర్వ గురించి షాలినీ, రోహిత్ తో చర్చించింది. కావాలనే తనను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయాలని అపూర్వ చూస్తోందని షాలినీ చెప్పింది. మరోవైపు మిథిలేష్ రెండు రోజులు ఇంట్లో ఉండి పదిహేను లక్షలు పట్టుకు వెళ్లాడు.. అగ్నిపరీక్ష టీం అంతా ఒక్కటే అని త్రిగుణ్, దేబ్జానీ మాట్లాడుకున్నారు.
రాత్రి అయ్యేసరికి మరో వివాదం జరిగింది. కెప్టెన్ రూం నుంచి త్రిగుణ్ కొన్ని డ్రింక్స్ ను దొంగతనంగా తీసుకెళ్లాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. కెప్టెన్ రూల్స్ ను పట్టించుకోకుండా ఇలా చేయడంతో మరోసారి హౌస్ లో కెప్టెన్సీ విలువపై చర్చ మొదలైంది.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Apoorva, Captaincy Task, Mukesh Gowda, Trigun, Shalini, Rohith, Mithilesh, Debjani]






