
విజయదశమి వేడుకను ఒక్కొక్కరి ఒక్కో రకంగా జరుపుకున్నారు. ఇక బుల్లితెర మీద కనిపించే ఆర్టిస్టులు, పెర్ఫార్మెర్స్, ఎంటర్టైనర్స్ కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్ లో చేసుకున్నారు. కొంతమంది ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. కొందరు చేసుకోలేదు. ఐతే ఈ పండగ సందర్భాన్ని ఎక్స్ప్రెస్ హరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "ఈ విజయదశమి పర్వదినాన దక్షిణ కర్ణాటకలో వెలిసిన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం కలగడం ఎంతో ఆనందం " అంటూ చెప్పాడు.
ఇక ఈ పిక్స్ ని చూసిన నెటిజన్స్ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. "త్వరగా పెళ్లి కావాలని వెళ్ళావా బ్రో. ఎం పూజ బ్రో అది. ఎలాగైనా బిగ్ బాస్ వెళ్లాలనే కదా ఈ పూజ. బిగ్ బాస్ నెక్స్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ నువ్వే. బ్రో నాగ్ మామకు వీకెండ్ స్క్రిప్ట్ నువ్వే రాస్తున్నావా. ఎందుకు బ్రో రోహిత్ మీద అంత పగబట్టావ్. బిగ్ బాస్ కి వెళ్ళడానికి క్షద్ర పూజ చేసావా బ్రో ? బ్రో గట్టిగా పూజ చేస్తున్నాడు ఈ సంవత్సరం గ్యారెంటీగా పెళ్లయిపోతుంది... నువ్వు ఈ సీజన్ వెళ్ళాల్సింది నీకు చుక్కలు కనిపించేవి " అంటూ వేరే లెవెల్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ మొదలయ్యేంత వరకు కూడా హరి బిగ్ బాస్ కి వెళ్తాడు అన్న టాక్ నడిచింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కూడా శ్రీముఖి, రోహిణి వంటి వాళ్లంతా ఆటపట్టించారు. ఐతే ఫైనల్ గా జబర్దస్త్ నుంచి రాంప్రసాద్, నాటి నరేష్ వెళ్లారు. కానీ హరి మాత్రం ఎలాగైనా బిగ్ బాస్ కి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీగా ఐనా ఈ సీజన్ కి వేళ్తాడో లేదో చూడాలి.




.webp)
.webp)
