Home

»

Tv News

బిగ్ బాస్ అనేది ఒక ట్రామా ... ఈ సీజన్ లో ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు  

Oct 9, 2026 6:01PM

సోషల్ మీడియాలో అఖిల్ సార్థక్ ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. రెండేళ్ల క్రితం ఒక సెలూన్ స్టార్ట్ చేసాడు. దాన్ని స్టార్ట్ చేసి అందరికీ మంచి సర్వీసెస్ అందిస్తున్నాడు. అలాంటి అఖిల్ సార్థక్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.

"బిగ్ బాస్ ఈ సీజన్ నేను అసలు చూడడమే లేదు. ఎవరు ఈ సీజన్ లో ఉన్నారో కూడా నాకు తెలీదు. నిజం చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నా పనులతో నేను బిజీగా ఉన్నాను. ఒకవేళా చూస్తే ఆ ట్రామాలోకి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. ఎవరైనా కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తే మేము ట్రామటైజ్ ఇపోతాం. కాబట్టి బిగ్ బాస్ కి దూరంగా ఉంటూ మిగతా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేస్తున్నా. చిన్న చిన్న షోస్ కి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కానీ నేను వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే టీవీ ఆడియన్స్ కి ఎప్పుడూ కనబడుతూ ఉంటే మూవీస్ లో ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు మమ్మల్ని. అందుకే గ్యాప్ ఇవ్వాలనుకుని సెలెక్టెడ్ వి మాత్రమే చేస్తున్నా. చాలా ఛానెల్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి కానీ నేనే వెళ్లాలనుకోవడం లేదు " అని చెప్పాడు. " అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్ సార్థక్.

ఇక అఖిల్ చెప్పిన ఈ విషయం మీద నెటిజన్స్ మండిపడుతున్నారు.  కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే కొందరు నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. "నిజం బిగ్ బాస్ చూస్తుంటే చాల టెన్షన్ స్టార్ట్ ఐపోతోంది. బిగ్ బాస్ చూడకుండా మంచి పని చేసావ్  " అంటుంటే ఇంకొంతమంది  మాత్రం "నువ్వు  ఈ స్టేజికి  వచ్చావ్ అంటే  ఆ చిన్న షోస్ అండ్ బిగ్ బాస్ వల్ల ....ఇప్పుడు నీకు చిన్న చూపు అయ్యిందా" అంటూ నెగటివ్ కామెంట్స్ పెట్టారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com