
బిగ్ బాస్ సీజన్ 10 ఇప్పుడు నడుస్తోంది. దానికి రేటింగ్ కూడా పీక్స్ లో ఉంది. అలాంటి బిగ్ బాస్ ని నార్మల్ ఆడియన్స్ కచ్చితంగా ఫాలో అవుతున్నారు. కానీ సెలబ్రిటీస్ అంటే షోస్ లో బిగ్ బాస్ లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు చూస్తారా లేదా అన్న విషయం మాత్రం డౌటే. ఎందుకంటే రకరకాల ఈవెంట్స్ , షోస్ వంటి వాటికి ఎక్కువగా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి పూర్తి ఎపిసోడ్ ని కానీ సీజన్ ని కానీ ఎక్కువ మంది ఫాలో అవ్వరేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆర్జే కాజల్ ఒక విషయాన్నీ చెప్పింది.
"ఫిట్ నెస్ జర్నీ స్టార్ట్ చేసాక టైం అస్సలు దొరకట్లేదు. దొరికిన టైం లో చూస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ట్రిగ్గర్ ఐపోతున్నాయ్. ఈ సీజన్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నాను. కానీ నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. మీరు నమ్ముతారు నేను సీజన్ 2 కూడా స్కిప్ చేసాను " అంటూ కాజల్ ఆర్జే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.
దీనికి కారణం లేకపోలేదు " గున్న ఏనుగులా ఉన్నావ్ లావుగా ఉన్నావ్ ... వెయిట్ తగ్గితే బెటర్ అని చాలామంది కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు కాజల్ రూట్ మార్చింది. ఫిట్ నెస్ జర్నీ స్టార్ట్ చేసింది. తానేంటో నిరూపించుకోవడానికి ట్రోలర్స్ కి ఆన్సర్ చేయడానికి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టింది. జిమ్ వీడియోస్ ని స్టార్ట్ చేసి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది. అలాగే యోగ కూడా చేస్తోంది.





.webp)
