Home

»

Tv News

Godhavari : గోదావరి సీరియల్‌లో ఊహించని గొడవ.. భువనకు షాకిచ్చిన సింహాద్రి!

May 19, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -07 లో.....శంకర్ తన ఫ్యామిలీని తీసుకొని తోటకి వెళ్తాడు. అక్కడే సింహాద్రి కూడా ఉంటాడు. ఆ తర్వాత శంకర్ తన ఫ్యామిలీకి ఇది మన తోటనే మనమే తీసుకున్నానని చెప్తాడు. అది విని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలని డబ్బు పోగు చేసానని శంకర్ చెప్తాడు. ఇప్పుడు మన కుటుంబంలోకి ఈ తోట కూడా చేరిందని శంకర్ చెప్తాడు. ఈ తోట అంతా చూసి వస్తామని పిల్లలు వెళ్తారు. తోట అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. నాన్న ఇంత డబ్బు పెట్టి ఇక్కడ కొనే కంటే సిటీలో ఇల్లు కొంటే బాగుండేదని నందు అంటుంది.

దూరపు కొండలు నూనుపు అని ఉంటుంది. ఎందుకు అలా ఆలోచిస్తావని జానూ అంటుంది. అక్క ఈ కొబ్బరికాయలతో ఆట ఆడుకుందామా.. ఎవరు ఎక్కువ దూరం వేస్తే వాళ్లే విన్ అయినట్టు అని కిన్నెరా అంటుంది. జానూ కొబ్బరి విసిరి వేస్తుంటే.. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. తనకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అది చూసి జానూ సారీ చెప్తుంది. అప్పుడే భువన వచ్చి నీకు కళ్ళు కన్పించడం లేదా అని కోప్పడుతుంది. జానూని కొట్టబోతుంటే శంకర్ వచ్చి ఆపుతాడు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా అని భువన అంటుంది. ఆ విషయంలో భువనకి సపోర్ట్ చెయ్యకుండా శంకర్ కి సపోర్ట్ చేస్తాడు సింహాద్రి. దాంతో భువన కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఊళ్ళో శంకర్ వెళ్తుంటే తోట కొన్నావ్ అంట.. నువ్వు నమ్మి ఆ సింహాద్రికి డబ్బు పంపిస్తున్నావ్ జాగ్రత్త.. సొంతవాళ్లనే నమ్మడానికి లేదని అంటాడు. మీరు ఏం అంటున్నారో నాకు అర్థం అయింది కానీ మా సింహాద్రి అలా కాదని శంకర్ చెప్తాడు. ఆ తర్వాత సూర్య జరిగింది గుర్తుచేసుకుంటాడు. అప్పుడే భువన వచ్చి మళ్ళీ జానూని తిట్టడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత శంకర్ వాళ్ళ అక్క సంబంధం మాట్లాడడానికి తాంబులంతో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com