Ticket To Finale Rithu Chowdary : వరుసగా రెండుసార్లు విజయం సాధించిన రీతూ.. రేస్ నుండి భరణి అవుట్!
on Dec 5, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తయ్యాయి. ఇక పదమూడో వారం 'టికెట్ టూ ఫినాలే' నడుస్తోంది. అయితే ఇందులో గెలిస్తే ఇమ్మ్యూనిటీ లభించడంతో పాటు ఫైనల్ లో మొదటి కన్ఫమ్ కంటెస్టెంట్ గా తమ స్థానాన్ని పదిలపరుచుకుంటారు.
ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం జరుగుతున్న ఈ టాస్క్ లలో రోజురోజుకు ఒక్కొక్కరి ఆధిపత్యం కొనసాగుతుంది. మొన్నటివరకు తనూజ, సుమన్ శెట్టి, భరణి, గెలవగా నిన్నటి ఎపిసోడ్ లో వారు రేస్ నుండి తప్పుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. భరణి, రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ నలుగురు మాత్రమే రేస్ లో ఉండగా మొదటి గేమ్ లో భరణి ఆడనని చెప్తాడు. దాంతో రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కలిసి గేమ్ ఆడుతారు. ఇది బ్యాలెన్సింగ్ టాస్క్. ఇందులో చేతిలో ఓ కర్ర పట్టుకొని పోటీదారులు ఉంటే.. ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వకూడదని అనుకుంటున్నారో వారి కర్ర మీద కాయిన్స్ పెట్టాలని బిగ్ బాస్ చెప్పారు. దీనికి తనూజ సంఛాలక్ గా ఉంది. ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఓడిపోతారు. రీతూ గెలుస్తుంది. ఇక చదరంగంలో ఓ గడిని సొంతం చేసుకుంటుంది. ఇక తర్వాతి గేమ్ లో ఎవరితో ఆడాలనుకుంటున్నావో రీతూని బిగ్ బాస్ చెప్పమన్నాడు. తను భరణి పేరు చెప్పింది.
ఇక చివరి టాస్క్ పేరు ' రింగ్ మాస్టర్'. గార్డెన్ ఏరియాలో జంక్ యార్డ్ ఉంటుంది. ఇందులో భిన్నమైన ఆకారంతో కొన్ని వస్తువులు ఉంటాయి. బిగ్ బాస్ చెప్పినప్పుడు వాటిని తీసుకొని సరిగ్గా అమర్చాలి. అవేంటంటే మూడు ట్రయాంగిల్స్, మూడు స్క్వేర్స్, మూడు సర్కిల్స్.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి తీసుకొని టేబుల్ మీద వరుస లైన్లలో పెట్టాలి. ఒక వరుస పూర్తి చేసిన ప్రతిసారి ప్లేయర్లు ఒక రింగ్ తీసుకొని పోల్‌కి హ్యాంగ్ అయ్యేలా విసరాలి.. ఇలా టాస్క్ ఎవరు ముందు పూర్తి చేస్తే వారు విన్నర్ అవుతారు. ఓడిపోయిన వారు ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి తప్పుకుంటారు. ఇందులో భరణి ఓడిపోతాడు రీతూ గెలుస్తుంది. ఇక రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ముగ్గురు టికెట్ టూ ఫినాలే రేస్ లో మిగిలారు. వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



