.webp)
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో భానుశ్రీ ఒకరు. గ్లామర్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు షోస్ కి వస్తూ ఉంటుంది. అలాంటి భానుశ్రీ ఇప్పుడు హోస్ట్ మారితే ఎలా ఉంటుంది. మరి ఆ టాపిక్ మీద ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రిలీజ్ చేసింది. ఈమధ్య కాలంలో చాలామంది కూడా హోస్టులుగా చేస్తున్నారు.
"ఇక ఇది భాను టైం... భాను హోస్టింగ్‌లో భాస్కర్ & జ్ఞానేశ్వర్! భాను హోస్ట్‌గా మారితే.. భాస్కర్, జ్ఞానేశ్వర్ గెస్టులుగా వస్తే.. ఆ సందడి, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు, నవ్వులు పూయించే సమాధానాలు, ఊహించని కౌంటర్లతో "ఇట్స్ భానుస్ టైం " షో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమైంది! భాను అడిగిన ప్రశ్నలకు భాస్కర్, జ్ఞానేశ్వర్ ఎలా స్పందించారు? అసలు ఎవరు ఎవరిని ఆటపట్టించారు? ఎలాంటి సరదా సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఫన్, గేమ్స్, నవ్వులు.. అన్నీ కలిపి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!" అంటూ చెప్పింది.
భానుశ్రీ బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఎన్నో తెలుగు షోస్ కి యాంకర్ గా చేసింది. బాహుబలిలో తమన్నా రోల్ లో భానుశ్రీ అక్కడక్కడా మెరిసింది. ఇక ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.





.webp)
