Home

»

Tv News

Illu Illalu pillalu : నర్మద, సాగర్ మధ్య గొడవ.. వల్లిని భద్రవతి క్షమిస్తుందా!

Oct 29, 2026 10:56AM

Illu Illalu pillalu : నర్మద, సాగర్ మధ్య గొడవ.. వల్లిని భద్రవతి క్షమిస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -617 లో.....భద్రావతి వల్లీని చూసి "ఊసరవెల్లి రా" అని పిలిచి నిన్ను అడ్డుపెట్టుకుని రామరాజు అంతు చూడాలనుకుంటే నువ్వే ప్లేట్ తిప్పేసి మంచిదానివి అయిపోయావని అంటుంది. ఇప్పటికీ మించిపోలేదు.. నాతో చేతులు కలుపు.. వాళ్ల అంతు చూసి నిన్ను ఇంట్లోకి పంపిస్తానని అంటుంది. అమ్మా తల్లీ నీ మాటలు, మా అమ్మ మాటలు విని కోల్పోయింది చాలు, నేను మారాను, నా బతుకు నేను చూసుకుంటా, నన్ను వదిలేయండి అని వల్లి అంటుంది. మీరు పాతికేళ్లుగా వాళ్ల మీద పగ పెంచుకున్నారు.. వాళ్లు మాత్రం మీ చెల్లిని.. మేనకోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని వల్లి అంటుంది. ఇప్పటికైనా మారండని వల్లీ చెప్తుంది.

వల్లీని క్షమించమని వేదవతితో శాంతమ్మ అంటే అంత మోసం చేసిన దాన్ని క్షమించే ప్రసక్తే లేదని వేదవతి అంటుంది. పెద్దమనసు చేసుకుని క్షమించండి అని సుకన్య అంటే నిన్ను కూడా దాని దగ్గరకే పంపేస్తానని వేదవతి అంటుంది. సుకన్య కాఫీ చేసి తీసుకొస్తే వేదవతి, శాంతమ్మ, ధీరజ్, ప్రేమ, నర్మద వరుసగా తీసుకుంటారు. మీ కొడుకు మంచి పని చేశాడు. చింతామణి దగ్గర అప్పు తీసుకుంటున్నాడని ప్రేమ చెప్తే చింతామణి దగ్గర అప్పు ఏంటని నర్మద తిడుతుంది. సుకన్య మూడోసారి కాఫీ తెస్తే సాగర్ తీసుకుంటాడు. డబ్బు రెడీ అయింది. సేటుకి కట్టేద్దామని సాగర్ అంటే ఎలా ఏర్పాటు చేశావ్.. లంచం తీసుకుంటూ చేశావా అని ఫైల్ చూపించి నర్మద అడుగుతుంది.

సాక్ష్యాలు లేకుండా నా మీద నింద వేస్తావా అని నర్మద మీద సాగర్ అరిచి వెళ్లిపోతాడు. నర్మద ఏడిస్తే అందరు ఓదారుస్తారు. వాడు అంత గట్టిగా చెప్పాడంటే చేయడం లేదేమోనని వేదవతి అంటుంది. మరోవైపు వల్లీకి భాగ్యం భోజనం ఇస్తే వల్లీ తీసుకోదు. కన్న పాపానికి తప్పదు తిను అని భాగ్యం అంటుంది. ఆనందరావు వచ్చి ఏడుస్తూ తినమ్మా, మేం చాలా పాపాలు చేశాం, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాం, మోసాల మీద మోసాలు చేశాం, అవన్నీ నీ కళ్లలో సంతోషం కోసమే, ఇప్పుడు కన్నీరు చూస్తే గుండె ఆగిపోదా, నీలో మార్పు వచ్చింది, ఇలాగే ఉండమ్మా, దేవుడు రెండో అవకాశం ఇస్తాడని తినిపిస్తాడు. చందు లాయర్ ని కలిసి నేను పూర్తిగా మోసపోయాను. వల్లీ చేసిన పనులన్నీ చెప్పి విడాకులు ఇప్పించాలని అంటాడు. సెటిల్మెంట్ కావాలంటే ఎంత డబ్బైనా ఇద్దామని చెప్పి విడాకుల నోట్ మీద సంతకం పెడతాడు. ఇంట్లో బతుకమ్మ ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com