.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-610లో.. వల్లీ రామరాజు వాళ్లని వదిలేయడంతో భాగ్యం కూతురిపై కోప్పడి ఇంటి నుంచి వెళ్లిపోమని అంటుంది. నువ్వు మాకు పుట్టినప్పటి నుంచి దరిద్రమే వెళ్లిపో అని తిడుతుంది. కూతుర్ని దరిద్రం అన్నందుకు భాగ్యాన్ని ఆనందరావు కొట్టడానికి చేయి ఎత్తుతాడు. కొట్టు అయ్యా కొట్టు అందరు అయిపోయారు నువ్వే మిగిలావని భాగ్యం ఎదురు తిరుగుతుంది.
అమ్మ ఏదో అనేసింది వదిలేయ్ అమ్మడూ అని ఆనందరావు బతిమాలినా వల్లీ వినదు. ఒక ఆడపిల్ల జీవితం కట్టుకున్నవాడికి భారం కావొచ్చు, అత్తారింటికి భారం కావొచ్చు కానీ కన్నవాళ్లకు కాకూడదు.. నన్ను దరిద్రం అనేసింది నేను వెళ్లిపోతానని తండ్రి ఎంత బతిమాలినా వెళ్లిపోతుంది. భాగ్యం వల్లీని ఊరికే వదలదని సుకన్య ఆలోచిస్తుంటే తిరుపతి వచ్చి కామెడీ చేస్తాడు. ఇంతలో సుకన్యకు ఆనందరావు కాల్ చేసి మీ రాక్షసి అత్త నా బిడ్డని గెంటేసింది.. కొంచెం వెళ్లి చూడమ్మా అని చెప్పడంతో సుకన్య, తిరుపతి ధీరజ్ కి విషయం చెప్తారు.
మరోవైపు ప్రేమ రెడీ అయి ధీరజ్ కోసం వెయిట్ చేస్తుంటే ధీరజ్ ముసుగు వేసుకుని వచ్చి ప్రేమను భయపెడతాడు. ఇద్దరు ముద్దు పెట్టుకోబోతుంటే నర్మద వచ్చి కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టేశావా అక్క అంటూ కచేరి ప్రోగ్రామా అంటూ కౌంటర్ వేస్తుంది. సుకన్య, తిరుపతి వచ్చి వల్లీ విషయం చెప్తే కొత్త నాటకం అని ప్రేమ తిడుతుంది. కానీ ధీరజ్ నిజంగా ఇంట్లో నుంచి గెంటేస్తే ఆడపిల్ల కదా అంటూ చూసి వస్తా అని బయలుదేర్తాడు. మరోవైపు భద్రావతి, సేనాపతి రామరాజు విషయంలో మనకు ప్రతీసారి ఎదురు దెబ్బ తగులుతుందని, వల్లీకి దెయ్యం పట్టిందా అనుకుంటారు. విశ్వ బామ్మతో వల్లీ కేసు వెనక్కి తీసుకుందని.. ధీరజ్ , ప్రేమ ట్రావెల్ బిజినెస్ పెడుతున్నారని చెప్పడం విని భద్రావతి ఆ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటుంది.
చివర్లో వల్లీ తన తప్పులు గుర్తు చేసుకుని ఎందుకు నాతో తప్పులు చేయించావ్ దేవుడా అని ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటుంది. నా మీద ఎంత కోపం ఉన్నా బావ వస్తాడని చందుకి కాల్ చేస్తుంది. చందు కాల్ కట్ చేసి ఎవరు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావని.. దూకి చావు నా దృష్టిలో నువ్వు ఎప్పుడో పోయావని అంటాడు. వల్లీని ఓ ఆకతాయి ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతుంటే వల్లీ రాయి తీసి కొట్టబోతుంది. సరిగ్గా అదే టైమ్ లో ధీరజ్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
