.webp)
అగ్నిపరీక్ష సీజన్ 2 ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ట్విస్ట్ తో సాగుతోంది.
రెండు టాస్క్ లు అయ్యాక హేమంత్ సేఫ్ అయిపోయి చివరకు మిగిలింది భాగి, రామకృష్ణ మాత్రమే. వీరిద్దరిలో ఎవరు ఉండాలని మిగిలిన కంటెస్టెంట్లను అడిగారు. అక్కడ మెజార్టీ కంటెస్టెంట్లు భాగి సేవ్ అవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. భాగి గతంలో హెయిర్ కట్ టాస్క్ లో చూపిన తెగింపు, ఆమె ఎమోషనల్ బాండింగ్ కారణంగా చాలా మంది ఆమెకే సపోర్ట్ చేశారు. దీంతో రామకృష్ణ పూర్తిగా ఒంటరి అయిపోయాడు. తనను ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో అతను ఎమోషనల్ గా బ్రేక్ అయ్యాడు.
రామకృష్ణ ఏడుస్తూ తన వాదన వినిపించాడు. నేను జెన్యూన్ గా ఉన్నాను.. నాకు వీలైనంత ఇచ్చాను.. టాస్క్ లో ప్రతీ ఒక్కరు తప్పులు చేస్తారు.. అందరూ చేశారు. నాకు స్టార్ కూడా వచ్చింది.. అయినా సరే మీరు నాకంటే బాగా ఆడారు ఒప్పుకుంటా కానీ నేను కూడా బాగానే ఆడానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కన్నీళ్లు చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు. భాగి స్వయంగా ఇతను అతి మంచివాడు అని చెప్పింది. అందరు భాగి సేవ్ అయినట్టే లెక్క అనుకున్నారు.. రామకృష్ణ ఇంటికి వెళ్తాడని ఫిక్స్ అయ్యారు.
కానీ అప్పుడే జ్యూరీ అసలు బాంబ్ పేల్చింది. మీది తుది నిర్ణయం కాదు.. మీ అభిప్రాయాన్ని మాత్రమే తీసుకున్నాం.. మా నిర్ణయం ప్రకారం భాగి అవుట్ అని ప్రకటించింది. ఈ ఒక్క మాటతో అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. మెజార్టీకి వ్యతిరేకంగా జ్యూరీ నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. దీనికి కారణాన్ని జ్యూరీ క్లియర్ గా చెప్పింది. నీలో ఫైర్ కనిపించడం లేదు.. కింద పడ్డా మీద పడ్డా తప్పులు చేసినా ఆడాలన్న కసి రామకృష్ణలో ఉందని చెప్పింది. ఆ కసినే బిగ్ బాస్ కు కావాలని జ్యూరీ ఫీలైంది.
ఈ నిర్ణయంతో చివరకు రామకృష్ణ సేఫ్ అయిపోయి భాగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. భాగి టాప్-15 లోకి వచ్చి హెయిర్ కట్ తో సేఫ్ అయినా చివరకు నిలబడలేకపోయింది. ఇక ఇదే చివరి ఎలిమినేషన్ అని యాంకర్ శ్రీముఖి ప్రకటించింది. అంటే ఇకపై జ్యూరీ చేతిలో ఏమీ లేదు.. మిగిలిన కంటెస్టెంట్ల భవిష్యత్తు పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్ లోకి ఎంత మంది వెళ్తారు.. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





