Home

»

Tv News

Illu illalu pillalu : భద్రవతి కుట్రకు బలైపోయిన ధీరజ్.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తూ అరెస్ట్ చేసిన పోలీసులు!

Jun 5, 2026 11:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -489 లో.... ధీరజ్ ని కేసులో ఇరికించాలని భద్రవతి, సేనాపతి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా ఒకతను ధీరజ్ కార్ కి అడ్డుగా వస్తాడు. నాకు లిఫ్ట్ ఇవ్వండి.. నేను డెలివరీ బాయ్ ని ఈ మామిడికాయలు డెలివరీ చేయాలి.. లేదంటే జాబ్ పోతుందని అతను అనగానే పాపం ఎక్కించుకుందాం రా అని ప్రేమ అంటుంది. సరే అని ధీరజ్ అంటాడు. అందులో ఏమున్నాయి ఒకసారి చూపించండి అని ధీరజ్ అనగానే అందులో ఉన్న మామిడికాయలు చూపిస్తాడు. సరే అని ధీరజ్ అతన్ని ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక ధీరజ్ కార్ ఆపి చెక్ చేస్తాడు. మామిడికాయల కింద మాదక ద్రవ్యలు ఉంటాయి. అవి చూసి ధీరజ్ షాక్ అవుతాడు.

ఆ మామిడికాయలు పట్టుకొని ఎక్కిన అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీటి గురించి మాకు తెలియదు సర్ ఎవరో ఒకతను డెలివరీ బాయ్ అంటూ ఎక్కాడు అని చెప్పినా గానీ వినకుండా ధీరజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత సెల్లో వేసి ధీరజ్ ని కొడుతుంటే ఇన్‌స్పెక్టర్ వీడియో కాల్ చేసి భద్రవతి, సేనాపతికి చూపిస్తాడు. అప్పుడే ప్రేమ వచ్చి వాడు ఏం తప్పు చెయ్యలేదు కొట్టకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రేమ స్టేషన్ కి రావడం చూసిన భద్రవతి.. నా మేనకోడలిని అక్కడ నుంచి పంపించండి అని  ఇన్‌స్పెక్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ ని వెళ్లి ప్రేమని ధీరజ్ నుంచి దూరంగా పంపిస్తాడు.

ఆ తర్వాత వల్లి, సుకన్య డ్యాన్స్ చేస్తుంటే నర్మద వెళ్తుంది. అసలు నువ్వు కడుపుతో ఉన్నావా అని అడుగుతుంది. ఈ డ్యాన్స్ ఏంటి అని నర్మద కోప్పడుతుంది. దాంతో వల్లి ఏదో ఒకటి కవర్ చేస్తుంది. ఆ తర్వాత నర్మదకి ప్రేమ ఫోన్ చేస్తుంది. జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో నర్మద షాక్ అవుతుంది. ఆ విషయం వెళ్లి రామరాజు వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com