.webp)
ఫామిలీ స్టార్స్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో సరదాగా సాగింది కానీ లాస్ట్ లో మాత్రం హోస్ట్ సుధీర్ కోసం మరదళ్ళు కొట్టేసుకున్నారు. ఆల్రెడీ సుధీర్ కి అటు ఇటు ఇద్దరు మరదలు ఉన్నారు. వాళ్ళు అష్షు రెడ్డి, చొక్కారావు స్రవంతి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో హోస్ట్ శ్రీముఖికి అటు ఇటు అవినాష్ , హరి పాలేర్లుగా ఎలా ఉంటారో ఈ షోలో సుధీర్ కి మరదళ్ళుగా వీళ్ళను పెట్టారు.
ప్రోమో స్టార్టింగ్ నుంచి అందరూ ఆడిపాడి సరదాగా నవ్వించారు. ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వచ్చారు. బెజవాడ బేబక్కా రీసెంట్ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వెళ్లి సెలెక్ట్ కానీ జపాన్ ఫుట అలాగే గత అగ్నిపరీక్షలో బాగా వైరల్ ఐన ప్రియా ఇలా చాలామంది వచ్చారు. ఫైనల్ లో "ఇట్స్ టైం టు పార్టీ నౌ " అనే సాంగ్ కి అందరూ డాన్స్ చేశారు. అక్కడ మొదలయ్యింది అసలు సినిమా.
ప్రియా వచ్చి "ఇన్ని రోజులు పాత మరదలు ఎందుకు కొత్త మరదలు అవుదామని చెప్పి " నేనంతలో పక్కనే ఉన్న అష్షు రెడ్డి వచ్చి "హలో హలో సబర్ కరో ఒకో మేమేమవ్వాలి ఇప్పుడు " అంటూ గట్టిగా ఫైర్ అయ్యింది. ప్రియా ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా సుధీర్ వైపు తిరిగి "మీకు ఒకే కదా " అంది. "నాకు డబుల్ ఓకే " అన్నాడు. అష్షు ఏమందో కానీ "తెలుసు నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంది. "వాళ్ళు చెప్పారని నేను చెప్పాను " అంది అష్షు. "ఓహో అలాగా ..వాళ్ళు జోక్ వేశారు " అంటూ సుధీర్ వంత పాడాడు. "వచ్చింది ఫస్ట్ టైమే కానీ మరీ ఇంత రూడ్ గ చెప్పాల్సిన అవసరం లేదు" అంది ప్రియా. వెంటనే అష్షు "నీకు బయట మైక్ ఉంది. చెప్పుకోవచ్చు కదా. నాకెందుకు" అంటూ బయట ఉన్న వాళ్ళను తిట్టింది. వెంటనే ప్రియా "అంటే మీరు ఇప్పుడు వాళ్ళను తిడుతున్నారా నన్ను తిడుతున్నారా. నాకు వాళ్ళను తిడుతూ నన్ను తిడుతున్నట్టు అనిపించింది. దాంతో ప్రియా బాగా హర్ట్ అయ్యి స్టేజి మీద నుంచి వెళ్ళిపోయింది. వెంటనే అష్షు రెడ్డి "డైరెక్షన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా ఉంటే బయటకు చెప్పుకోండి " అని అష్షు గట్టిగా చెప్పేసి వెళ్లి కూర్చుని ఏడ్చేసింది.




.webp)
.webp)
