Home

»

Tv News

15 రోజులు ఉన్నా.. 15 వారాలకు సరిపడా కంటెంట్ ఇచ్చా.. బిగ్ బాస్ అపూర్వ కామెంట్స్!

Oct 15, 2026 2:18PM

బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఐతే రీసెంట్ గా ఎలిమినేట్ ఐన అపూర్వ బిగ్ బాస్ హౌస్ లోని విషయాలను ఇంటర్వ్యూస్ లో చెప్పుకొస్తోంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇంతకు ఎం చెప్పింది అంటే ...

"ఫెయిర్ అన్ ఫెయిర్ పక్కన పెడితే నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నా డెస్టినీ డిసైడ్ చేశా. 15 రోజులు ఉన్నాను. 15 వారాలు ఇవ్వాల్సిన కంటెంట్ ఇచ్చాను. అపూర్వ వెళ్ళింది దడదడలాడించింది. నేను వెళ్ళినప్పుడు 4 అలయెన్సస్ ఉండేవి నేను వెళ్ళాక వాటిని చెల్లాచెదురు చేసి 2 అలయెన్సస్ చేశా. ఆ రెండిటిని అవతల పక్కన పెట్టి నేను ఇవతల వైపు ఉన్నాను. ఆడాను, పోట్లాడాను, నచ్చచెప్పడానికి ప్రయత్నించాను, ఏడ్చాను, అరిచాను అన్ని చేసాను. ప్రతీ రోజు ప్రోమోలో నేను ఉన్నాను. సో నేను వెళ్లాను గేమ్ ని తిప్పడం కాదు. గేమ్ ని నా చుట్టూ తిప్పుకున్నాను. 15 రోజులు ఒక వెలుగు వెలిగాను. బయటకి వచ్చాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఏది జరిగినా నా మంచికే జరిగింది  అనుకున్నా. నేను హౌస్ లోకి ఎంటర్ అవ్వకముందే ఎంట్రన్స్ దగ్గర నిలబడి నీకు శ్రద్ద లేదు , ఏకాగ్రత లేదు నువ్వు వెన్ను పోటు పొడుస్తున్నావ్ అని నేను మొహం మీదే చెప్పేసాను. నేను అడుగుపెట్టాక ముందు నుంచే నాకు రైవల్రి స్టార్ట్ అయ్యింది. నేను రైవల్రి అన్నా తీసుకోవాలన్న కానీ మాట మార్చుకోవాలనుకోలేదు. చాల మంది చాలా విషయాల్లో చాలా తప్పులు చేశారు ఆ విషయాలను నేను నామినేషన్స్ లో చెప్పాను ఎలిమినేషన్ ఐపోయి వస్తున్నప్పుడు కూడా చెప్పాను. " అంటూ ఎన్నో విషయాలు చెప్పింది బిగ్ బాస్ కంటెస్టెంట్ అపూర్వ.

అపూర్వ చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఖమ్మానికి చెందిన అమ్మాయి. ఏలూరు పెరిగింది. చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే ఇష్టం నటన అంటే ఆసక్తి కూడా. మోడలింగ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మిస్ గ్రాండ్ తెలంగాణ 2025 విన్నర్ గా నిలిచింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com