
బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అపూర్వ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా వైల్డ్ కార్డ్ గా వచ్చిన అపూర్వ ఆల్ రౌండర్, ఆడపులి అంటూ హడావిడి చేసింది కానీ ఆటకంటే అరుపులే ఎక్కువ అయ్యాయని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఓటింగ్ లో లీస్ట్ లో ఉండటంతో ఫస్ట్ ఎలిమినేషన్ గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్ షోలో శివాజీ అపూర్వను ఇంటర్వ్యూ చేశాడు. అక్కడ కూడా అపూర్వ తన అరుపుల స్టైల్ ని కంటిన్యూ చేయడంతో ఇంటర్వ్యూ మొత్తం రచ్చరచ్చగా మారింది. ఎంట్రీలోనే శివాజీ హౌస్ లోకి వెళ్లేటప్పుడు బటర్ ఫ్లై అని చెప్పావ్, అక్కడికి వెళ్లాక అందరి చెవుల్లో జోరీగలా మారావ్ అంటూ గాలి తీసేశాడు.
ఇంటర్వ్యూలో శివాజీ ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ కి అర్హులే, మీరు హౌస్ లో ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించాడు. దానికి అపూర్వ నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చాను అని సమాధానం చెప్పింది. వెంటనే శివాజీ అందరికీ రెస్పెక్ట్ ఇస్తే అందరూ నీకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారు, 11 మందిలో 10 మంది నిన్ను ఎలిమినేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అని కౌంటర్ వేశాడు. దానికి అపూర్వ నేను ఎంట్రీలోనే ముకేష్ గౌడ్ ని టార్గెట్ చేశాను, దీంతో వాళ్లంతా గ్రూప్ లుగా ఫామ్ అయ్యి నన్ను టార్గెట్ చేసి బయటకు పంపారని చెప్పింది. బిగ్ బాస్ పర్సనాలిటీ షోనే కాదనడం లేదు కానీ నేను కంప్లీట్ గా మార్చుకుని కొత్త అపూర్వగా మారలేను, నాలో ఒరిజినాలిటీ ఉండాలి, రియాలిటీలో ఎలా ఉన్నానో అక్కడ అలాగే ఉన్నాను, 14 మంది ఒకవైపు నేను ఒక్కదాన్ని ఒకవైపు ఉండటంతో నా వాయిస్ గట్టిగా వినిపించాల్సి వచ్చింది అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది.
అపూర్వ చెప్పిన దానికి శివాజీ మీరు అరుస్తారు కానీ తర్వాత అడుక్కుంటారు అంటూ సెటైర్ వేశాడు. షాలినితో ఎంత గొడవ అయినా మళ్లీ షాలినీ నువ్వంటే ఇష్టంరా అంటావ్, ఆ అవసరం ఎందుకు, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఆత్రం ఎందుకు అని నిలదీశాడు. దానికి అపూర్వ నాకు త్రిగుణ్, ముకేష్ వ్యతిరేకం అయిపోయారు, నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఎవర్నీ దూషించలేదు, బూతులు తిట్టలేదు అని అంది. వెంటనే శివాజీ బూతులు మాట్లాడనంత మాత్రాన నీతిమంతులు అయిపోరు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆ మాటతో అపూర్వ హర్ట్ అయ్యి మీరు నన్ను కంప్లీట్ చేయనీయడం లేదు అంటూ శివాజీపైనే అరుపులు మొదలెట్టింది, ఇంటర్వ్యూలో కూడా హౌస్ లో మాదిరిగానే బిహేవ్ చేసింది.
అపూర్వ అరుపులతో శివాజీకి తిక్కలేచింది, ఏం ఫీల్ ఉంది మావా అంటూ రెచ్చిపోయాడు. హౌస్ లో కూడా ఇలానే అందరిపై అరిచావ్, అందుకే అందరూ నీకు వ్యతిరేకంగా మారారు అని చెప్పాడు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కాస్తా వాగ్వాదంగా మారడంతో నెటిజన్లు కూడా అపూర్వ తీరుపై ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు కూడా త్రిగుణ్ ఫ్యామిలీని లాగడం, షాలిని, ఝాన్సీలపై కామెంట్స్ చేయడం, సింపతీ ఏడుపు అంటూ నాగార్జున చేత కూడా క్లాస్ పీకించుకుంది అపూర్వ, ఇప్పుడు బజ్ లో కూడా అదే తీరు కంటిన్యూ చేసిందని అంటున్నారు. మొత్తంగా అపూర్వ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఫుల్ ఫైర్ గా మారింది. శివాజీ ఎంత కూల్ గా ప్రశ్నలు అడిగినా అపూర్వ మాత్రం అరుపులతోనే సమాధానం చెప్పడంతో ఇంటర్వ్యూ హైలైట్ అయింది. బిగ్ బాస్ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయావ్, కంటెంట్ ఇవ్వడానికి బదులు గొడవలే ఇచ్చావ్ అని శివాజీ తేల్చేశాడు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అపూర్వ బిహేవియర్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.




.webp)

