Home

»

Tv News

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు’ సాంగ్ ని బాలయ్య కోసం రీమిక్స్ చేస్తా : అనిల్ రావిపూడి

Oct 28, 2026 11:52AM

సరిగమప షో ఈ వారం చాలా అద్భుతంగా వీనుల విందుగా సాగింది. అందులోనే  సింగర్ కంటెస్టెంట్స్ తో కలిసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఛాలెంజ్ ని కూడా ఇవ్వడంతో అందరూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి జడ్జెస్ ని మెప్పించారు. ఇందులో ఒక సింగర్ వినీత్ "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్లు " అంటూ ఒక సాంగ్ పాడాడు. దానికి సాయి  పియానో గిటార్ 2 ఇన్ 1 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తో అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. దానికి అనిల్ రావిపూడి ఫిదా ఇపోయారు.

ఇక ఆ సాంగ్ మీద కూడా కామెంట్ చేశారు. "ఈ సాంగ్ నాకు ఎంత ఇస్తామంటే దీన్ని నేను బాలయ్య బాబుకు రీమిక్స్ చేద్దామనుకున్నాను  ఒకానొక టైములో. ఒకవేళ ఫ్యూచర్ లో రీమిక్స్ చేస్తే గనక ఈ షోలో ఉన్న మ్యూజిక్ టీమ్ ని తీసుకెళ్తాను " అని చెప్పాడు. ఇక అనంత శ్రీరామ్ ఐతే పిల్లిమొగ్గలు వేసి మరీ ఎంటర్టైన్ చేశారు. అలాగే అనిల్ రావిపూడి ఇచ్చిన టాస్క్ కి స్టేజి మీద నుంచి ఆయన సీట్ వరకు కూడా పిల్లిమొగ్గలు వేస్తూ వచ్చారు. దాంతో అందరూ షాకైపోయారు.

"నేను ఇన్ని పల్టీలు కొట్టాను అంటే దానికి కారణం సాయి గారు మీ మ్యూజిక్ ఇచ్చిన ఎనర్జీ. వెంట్రుకలోని చివరి కణం నుంచి కాలి బొటన వేలి చివరి కణం వరకు మ్యూజిక్ ఇలా యాసిడ్ లా కురిసి కనకనాన్ని తగలబెట్టేయడం అంటే ఏమిటో మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ లో చూసా. మీ వేగానికి ఆ వేగం నుంచి పుట్టిన రాగానికి ఆ రాగం వలన మేము అనుభవించిన వీనుల భోగానికి ఫిదా " అంటూ చెప్పుకొచ్చారు అనంత శ్రీరామ్.
------------------

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com