.webp)
మరో వారంలో దసరా పండగ రాబోతున్న నేపథ్యంలో బుల్లితెర రకరకాల షోస్ ఈవెంట్స్ తో కళకళలాడిపోతోంది. ఇక "దసరాకి విడుదల " పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ఎపిసోడ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రకరకాల జానర్స్ నుంచి మంచి పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళంతా ఈ ఈవెంట్ గా హాజారుకాబోతున్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోకి వచ్చాడు. రావడమే కాదు ఎప్పటిలాగే ఫుల్ జోష్ పంచె పంచులు వేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు.
అనిల్ రావిపూడి వచ్చి స్టేజి మీద ఉన్న లేడీస్ అందరితో కలిసి "కుర్రాడు బాబోయ్ " అనే సాంగ్ కి ఇరగదీసి డాన్స్ చేసాడు. తర్వాత ప్రభాస్ శీను వచ్చి "భార్య భర్తల బంధం ఎలా ఉండాలి " అని అడిగాడు. "సైకలాజికల్ గా ఉండాలి. ఎవరు సైకోనో ఎవరు లాజికలో తెలుసుకోవటమే భయభర్తల బంధం" అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చారు. తర్వాత బుల్లితెర నటుడు సిద్దార్థ్ వర్మ "పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు కాదన్నా అసలేంటి ఆ కాన్సెప్ట్ " అని అడిగాడు. "నూరేళ్లు పంట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం " అని చెప్పారు అనిల్ రావిపూడి. "ఇంట్లో దీపం పెడితే భార్య టార్చర్ ఉంటుందనే ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు" అని చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేశారు అనిల్ రావిపూడి.
ఇక తర్వాత హీరో విజయ్ దేవరకొండ వచ్చి అందరినీ మెస్మోరైజ్ చేశారు. రాగానే ప్రదీప్ మీద సెటైర్స్ వేశారు. "బుల్లెబ్బాయి ఇటురా " అని పిలిచారు ప్రదీప్ ని . ప్రదీప్ కూడా సిగ్గు పడుతూ వచ్చాడు. "చాలా మిస్ అయ్యాను నిన్ను. చాలా రోజులవుతోంది నిన్ను చూసి " అన్నారు. "మేము జాన్ జిగర్ కా జబ్బాష్ " అంటూ ప్రదీప్ ఏదో వెరైటీ గా చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి. ఆ తర్వాత లేడీ సెలబ్రిటీస్ అంతా వచ్చి విజయ్ దేవరకొండ నటించిన మూవీస్ లో హీరోయిన్స్ లా నటించేసరికి విజయ్ వాళ్ళ క్యారెక్టర్స్ ని గుర్తుపట్టి ఎంటర్టైన్ చేసాడు. ఇక ఫైనల్ లో గీత గోవిందంలో ఏంటి ఏంటి అనే సాంగ్ కి విజయ్ డాన్స్ చేస్తే వెనక అష్షు రెడ్డి అతన్ని ఇమిటేట్ చేస్తూ ఫన్ చేసింది.
---------------





.webp)
