Home

»

Tv News

ఇప్పుడు ఢీ...జబర్దస్త్ ఒక్కటే ...యాంకర్ ఉదయభాను కామెంట్స్ వైరల్

May 17, 2026

ఒకప్పుడు యాంకర్స్ లో మంచి పేరుతో లేడీ డాన్ అనిపించున్న ఉదయభాను గురించి ప్రత్యేకంగా చూడక్కర్లేదు. అలాంటి ఉదయభాను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. "మీకు తెలిసిందే లేదో కానీ ఢీ షోని మీ కోసమే చాలామంది చూసేవాళ్ళు. ఒక బొమ్మలా కనిపించేవాళ్ళు. మీ డ్రెస్సింగ్ స్టైల్ కోసం అలాగే ఆ డ్యాంసింగ్ షోలో మీరు చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్.   ఐతే ఆ ఫ్లేవర్ ఇప్పుడు మిస్సవుతోంది." అని యాంకర్ అనేసరికి యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఆన్సర్ మాములుగా లేదు. "ఇప్పుడు జబర్దస్త్, ఢీ ఒకటేనండి. చెప్తే కోపం వస్తుందేమో. ఆల్మోస్ట్ అంతే కదండీ. పది మంది కలిసి కామెడీ చేయడం దాని గురించి అందరూ నవ్వుకోవడం చేస్తున్నారు. ఒకప్పుడు నేను చేశానని కాదు జనరల్ గా చెప్తున్నాను. ప్రతీ మాష్టర్ కి ఒక లైఫ్ ఇచ్చింది ఆ షో.  ఐతే అప్పట్లో వేరే రాష్ట్రాల వాళ్ళు, తమిళ్ మాష్టర్లు ఎక్కువగా పాపులర్ గా ఉండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అవకాశాల కోసం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు తెలుగు మాష్టర్లు రూల్ చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎన్ని మాటలు పడ్డారో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ టైములో మాష్టర్లు గురించి బాగా హైలైట్ చేసేవాళ్ళం. ఎంతసేపు డాన్స్ గురించే చెప్పేవాళ్ళం. దాంతో పాటు ఫన్ ఉండేది. ఆడియన్స్ మాష్టర్లుకి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. మాష్టర్లుకి ఏమన్నా ఐతే ఆడియన్స్ మనసు విలవిలలాడేది. " అంటూ ఉదయభాను చెప్పింది. "మీరెందుకు షోలు ఇవన్నీ కంటిన్యూ చేయలేదు" అని యాంకర్ అడిగేసరికి "మీరు షోలో లేరు అన్న విషయం గురించి ఈరోజు వరకు ఒక్క కాల్ కూడా చేసిన పాపాన పోలేదు. ఛానెల్ వాళ్ళ నుంచి కానీ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి కూడా ఒక్క కాల్ కూడా రాలేదు. ఎంత కఠినంగా ఉంటారు మనుషులు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను చేసిన షోస్ లో కొన్ని ఎక్స్పీరిఎన్సెస్ చెప్తే డే అండ్ నైట్ షూట్ చేసేటప్పుడు ఏసీ ఉండేది కాదు పెద్ద పెద్ద లైట్స్ ఉండేవి. కుండలతో నీళ్లు పోస్తే ఎలా తడిసిపోతామో అలా చెమటలతో తడిసిపోయేదాన్నని. స్టార్టింగ్ ఢీ షోస్ చూస్తే అర్ధమవుతుంది. ఉదయాన్ని అందరికంటే ముందు యాంకర్ రెడీగా ఉండాలి. తెల్లవారుజామున 4 గంటలకు పాకేప్ ఐనా కూడా 6 గంటలకల్లా మళ్ళీ రెడీగా ఉండాలి. అలా ఎక్కువ సేపు నిలబడడం   వలన వేళ్ళకు పొక్కులొచ్చేవి. ఇంత చేసినా గ్రాటిట్యూడ్ కానీ చిన్న అప్రిసియేషన్  కానీ ఏమీ లేదు. బాధపడడం నా డిక్ష్నరీలోనే లేదు. నాకు అంత స్పేస్ కూడా లేదు. నా పిల్లల్తో ఎంజాయ్ చేయడమే నాకు ఇంపార్టెంట్" అని చెప్పారు ఉదయభాను.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com