సౌమ్య రావు అంటే ఫ్లవర్ అనుకుంటిరా ఫైర్...
on Jan 10, 2025

రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా బుల్లితెర మీద ఒక షో ప్రసారమయ్యింది. అందులో నూకరాజు యాంకర్ సౌమ్య రావు తెలుగు మీద రకరకాల కామెంట్స్ చేసాడు. ఆమెకు తెలుగు రాదనీ చెప్పాడు. దాంతో ఆమె కూడా కొంచెం ఫీల్ అయ్యింది. కన్నడ వాళ్ళను ఇక షోస్ కి పిలవకండి మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి అంటూ పాపం కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. కానీ ఆ ఇన్స్పిరేషన్ తో ఆమె పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నట్టు ఉంది. రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే అందులో డైలాగ్స్ చించేసింది.
బులెట్ భాస్కర్ , సౌమ్య స్కిట్ లో ఆమె చెప్పిన డైలాగ్ వైల్డ్ ఫైర్ లా ఉంది. "భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలను తెగనరికి కిట్టూర్ లో విజయపతాక ఎగరవేయకపోతే నేను కిట్టూర్ చెన్నమ్మనే కాను..ఇంకోసారి పన్ను అనే పదం నీ నోటి నుంచి వినిపిస్తే నీ నాలుక చీరేస్తా..జాగ్రత్త" అంటూ పేల్చిన డైలాగ్ బాంబుతో స్టేజి మొత్తం షాకైపోయింది. సౌమ్య నేనా ఈ డైలాగ్స్ తెలుగులో చెప్పింది అంటూ ఆశ్చర్యపోయారు. సౌమ్య కన్నడ అమ్మాయి. కన్నడ నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో షోస్ చేస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా వచ్చినప్పుడు ఆమెను అందరూ కూడా చాలా ఎగతాళిగా ఆమె తెలుగును కామెంట్ చేశారు. కానీ అందరినీ ఓడించి తెలుగులో ఇప్పుడు చెప్పిన డైలాగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. సౌమ్య అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అన్న రేంజ్ లో ఆ పవర్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ డైలాగ్స్ చెప్పి భేష్ అనిపించుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



