
బుల్లితెర మీద ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. అందులో అనసూయ కూడా ఒకరు. అలాగే అప్ కమింగ్ యాంకర్స్ కూడా ఉన్నారు. అందులో ధరణి ప్రియా కూడా ఒకరు. యాంకర్ గా యాక్టర్ గా కమెడియన్ గా చేస్తూ ఉన్నారు. అలాటి ధరణి ప్రియ రీసెంట్ గా అనసూయతో ఒక సాంగ్ లాంఛ్ చేయించారు. ఆ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
"నా 3 వ సాంగ్ ని మన సొంత మనిషి అనసూయతో లాంఛ్ చేయించాను. మన వాళ్ళతో మన సాంగ్ లాంఛ్ చేయిస్తే ఆ కిక్కే వేరప్పా. అనసూయ అక్క చాలా ధన్యవాదాలు " అంటూ చెప్పింది ధరణి ప్రియా. ఇక అనసూయ, ధరణి ప్రియా ఇద్దరూ కూడా చక్కగా చీరలు కట్టుకుని చాలా పొందిగ్గా ఉన్నారు. దాంతో నెటిజన్స్ అంతా కూడా "ఇలా పద్దతిగా శారీలో ఉంటే బాగుంటుంది. యు ఆర్ ది బెస్ట్ అను. హాయ్ అను అండ్ ధరణి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
"ఓం కాళివే శ్రీకాళివే మహంకాళివే నువ్వు దుర్గమ్మ " అనే సాంగ్ లాంఛ్ చేసాక వరమ్మ వాయిస్ చాలా బాగుంది. ప్రతీ పండగలో పాట మారుమోగాల్సిందే. వాయిస్ చాలా సూట్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చేస్తూ ముందుకెళ్లు. మీ ఎంటైర్ టీమ్ కి చాలా సంతోషం. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ధరణి నందాలో బతుకమ్మ సాంగ్ 1.4 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.





.webp)
