.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 హౌస్ లో అమన్, రోహిత్ మధ్య మరోసారి పెద్ద గొడవ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ కోసం సపోర్టర్లను ఎంపిక చేసే క్రమంలో ఈ ఫైట్ మొదలైంది.
గ్రీన్ లెవెల్ కంటెస్టెంట్లకు ఇచ్చిన అల్టిమేట్ గోట్ కెప్టెన్సీ టాస్క్ లో త్రిగుణ్ గెలవాలని అమన్ మనస్పూర్తిగా కోరుకున్నాడు. అతనికి సపోర్టర్ గా ఉండటానికి సిద్ధమయ్యాడు. అయితే ముఖేశ్, అమన్ పేర్లని రోహిత్ వద్దనే విషయంలో చర్చ రావడంతో అమన్, రోహిత్ మధ్య మాటలు పెరిగాయి.ఈ క్రమంలో .. నువ్వు కన్నింగ్ రా అంటూ రోహిత్ ని అమన్ ఘాటుగా విమర్శించాడు. దీనికి రోహిత్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం హౌస్ మొత్తం హీటెక్కించింది. చివరకు ఓటింగ్ ద్వారా అమన్ సపోర్టర్ గా ఫైనల్ అయ్యాడు.
అసలే గతంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, త్రిగుణ్ ఫ్యాన్ అయిన అమన్ త్రిగుణ్ కి సపోర్ట్ చేయడాన్ని రోహిత్ తట్టుకోలేకపోయాడని హౌస్ మేట్స్ చర్చించుకుంటున్నారు. ఈ గొడవతో హౌస్ లో రెండు గ్రూపులుగా మరింత క్లియర్ గా విడిపోయినట్లు కనిపిస్తోంది.




.webp)
.webp)
