
బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లో 33వ రోజు నమ్మకద్రోహం ఎపిసోడ్ గా మారింది. సేఫ్ జోన్ లో ఉన్న ఏడుగురిలో - వర్షిణి, అమన్, దేబ్జాని, త్రిగుణ్, సుధీర్, రామ్ ప్రసాద్, వంశీ - ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఉందని, ఇద్దరు తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో అసలు డ్రామా మొదలైంది. ఇంతకు ముందు త్రిగుణ్, అమన్ మధ్య ఒక క్లియర్ ఒప్పందం జరిగింది. లీడర్ బోర్డులో పాయింట్స్ తక్కువ ఉన్న త్రిగుణ్ కి కెప్టెన్సీకి వెళ్లే ఛాన్స్ ఇవ్వాలని, అమన్ తప్పుకుంటానని మాట ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరి ముందే ఈ మాట చెప్పడంతో త్రిగుణ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
కానీ సీన్ అక్కడే మారిపోయింది. డేంజర్ జోన్ లోకి వెళ్లిన రోహిత్ సేఫ్ జోన్ లో ఉన్న అమన్ తో మాట్లాడి మైండ్ మార్చేశాడు. రోహిత్ ప్రేరేపణతో అమన్ ఒక్కసారిగా మాట మార్చి "నేను కూడా కెప్టెన్సీకి పోటీ పడతా, త్రిగుణ్ కి ఛాన్స్ ఇవ్వను" అని చెప్పేశాడు. ఇది వినగానే త్రిగుణ్ షాక్ అయ్యాడు. "నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఇప్పుడు రోహిత్ మాట విని నాకు వెన్నుపోటు పొడుస్తున్నావా" అంటూ అమన్ పై ఫైర్ అయ్యాడు. హౌస్ లో ఉన్న వర్షిణి, షాలిని కూడా అమన్ తీరును తప్పుపట్టారు.
అమన్ మాట మార్చడం వెనుక రోహిత్ పాత్ర ఉందని హౌస్ మేట్స్ గట్టిగా అనుకుంటున్నారు. రోహిత్ తాను డేంజర్ జోన్ లో ఉన్నా కూడా గేమ్ ను బయట నుంచి కంట్రోల్ చేస్తున్నాడని, అమన్ ని పప్పెట్ లా ఆడిస్తున్నాడని టాక్ వినిపించింది. షాలిని కూడా "రోహిత్ కావాలనే గొడవలు పెడుతున్నాడు, అమన్ ని రెచ్చగొడుతున్నాడు" అని కామెంట్ చేసింది. వర్షిణి అయితే అమన్ తో నేరుగా "నువ్వు ఇలా మాట తప్పడం కరెక్ట్ కాదు, త్రిగుణ్ నిన్ను నమ్మాడు" అని చెప్పింది. దీంతో అమన్, త్రిగుణ్ మధ్య గొడవ పెద్దదైంది, ఒకరినొకరు నమ్మకద్రోహి అంటూ మాటల యుద్ధానికి దిగారు. చివరికి ఈ గొడవ కారణంగా సేఫ్ జోన్ లో ఉన్నవారిలో క్లారిటీ లేకుండా పోయింది. త్రిగుణ్ కి కెప్టెన్సీకి వెళ్లాల్సిన ఛాన్స్ అమన్ వల్ల మిస్ అయినట్టు అయింది. రోహిత్ మాత్రం డేంజర్ జోన్ లో ఉండి కూడా సేఫ్ జోన్ లో చిచ్చు పెట్టడంలో సక్సెస్ అయ్యాడని అనిపించింది. ఈ వెన్నుపోటు వ్యవహారం తర్వాత హౌస్ లో త్రిగుణ్, అమన్ ఫ్రెండ్షిప్ కి బీటలు పడ్డాయని, ఇక నుంచి ఇద్దరూ ప్రత్యర్థులుగా మారతారని క్లియర్ గా కనిపిస్తోంది. మరి దీని ఎఫెక్ట్ నామినేషన్స్ పై ఎలా ఉంటుందో చూడాలి.




.webp)
.webp)
