.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -08 లో.... శంకర్ వాళ్ళ ఇంటికి శంకర్ వాళ్ళ అక్క తాంబూలాలతో పాటు పూజారిని కూడా తీసుకొని వస్తుంది. శంకర్ వాళ్ళ అక్క కొడుకు మురళికి, శంకర్ కూతురు అలకనందకి పెళ్ళి చేయాలని చిన్నప్పటి నుండి అనుకుంటారు. ఇక దుబాయ్ నుండి శంకర్ రాగానే వాళ్ళ అక్కని కలిసి మాటిస్తాడు. మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేద్దామని శంకర్ అనగానే సరేనని వాళ్ళ అక్క అంటుంది. మంచి ముహూర్తం చూసుకొని శంకర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక వాళ్ళని చూసి అలకనంద షాక్ అవుతుంది. ఇక జానుని తీసుకొని వెళ్ళి నాకు బావ ఇష్టం లేదని నీకు చెప్పాను కదా మళ్ళీ ఎందుకొచ్చారని అలకనంద అంటుంది. నాన్న నీ పెళ్ళి కోసమే దుబాయ్ నుండి వచ్చాడు.. మనకి ఏం ఉందో దాన్ని బట్టి మన ఆశలు ఉండాలని జాను అంటుంది. నాకు అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని ఉంది.. ఇలా ఊర్లో ఉండిపోవాలని లేదంటూ అలకనంద మొండిపట్టు పట్టుకొని ఉంటుంది. ఇక అలకనందని వాళ్ళ నాన్న శంకర్ పిలుస్తాడు. అత్తయ్య వాళ్ళు చీర ఇచ్చారు తీసుకోమని అనగానే ఇష్టం లేకపోయినా తీసుకొని తన గదిలోకి వెళ్ళి పడేస్తుంది.
ఇక జాను వెళ్ళి అలకనందని కన్విన్స్ చేయాలని చూస్తుంది కానీ తన మాట వినదు. వాళ్ళ దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటే ఇలా చేస్తున్నావు.. నువ్వు గదిలో నుండి బయటకు రాకు. నేను చూసుకుంటానని అంటుంది. తను బయటకు రావడానికి సిగ్గుపడుతుందని శంకర్ వాళ్ళ అక్కతో అలకనంద వాళ్ళ అమ్మ చెప్తుంది. మరో పదినిమిషాల్లో మంచి ముహూర్తం ఉందని
పూజారి అనడంతో తాంబూలాలు మార్చుకోవాలని అనుకుంటారు. అప్పుడే అలకనంద వచ్చి .. ఆపండి అంటూ తాంబూలాలని తీసుకొని విసిరేస్తుంది. నాకు మురళి బావతో పెళ్ళి ఇష్టం లేదని అలకనంద అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ చెంపచెల్లుమనిపిస్తుంది. ఏంటి ఆడపిల్లని అలా కొడుతున్నావని శంకర్ అంటాడు. తను ఏం చేస్తుందో మీకు తెలియదండి అని శంకర్ భార్య అంటుంది. ఇక అలకనంద తన బాధని చెప్తుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.. ఇలా బట్టలు కుట్టుకుంటూ ఊళ్ళో ఉండేవాడిని నేను చేసుకోను.. నా డ్రీమ్స్ వేరు.. నాకు బావని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని తనని తక్కువ చేసి మాట్లాడుతుంది అలకనంద. ఇక జాను వచ్చి నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే లేదని చెప్పు అంతేకానీ బావని తక్కువ చేసి మాట్లాడకు అని జాను అంటుంది. ఇక జాను చెంపచెల్లుమనిపిస్తుంది అలకనంద. అంతా నీ వల్లే.. బావ అంటే నాకు ఇష్టం లేదని ఆరోజే చెప్పమంటే చెప్పలేదని అలకనంద అంటుంది. ఇక మురళి అదంతా అర్థం చేసుకొని వెళ్ళిపోదామని వాళ్ళ అమ్మతో చెప్తాడు. ఇక వాళ్ళ అమ్మ.. నా కొడుకుని బాధపెట్టిన ఎవరు సంతోషంగా ఉండరు.. మీరంతా నాశనం అయిపోతారంటూ షాపనార్థాలు పెడుతుంది. అదంతా శంకర్ చూసి బాధపడతాడు.
అలకనంద, జానూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్తారు. శంకర్ మాత్రం డల్ గా ఒక కుర్చీలో కూర్చొని ఉంటారు. ఇక అతని దగ్గరకి వాళ్ళ అమ్మ, భార్య వస్తారు. అదేదో చిన్నపిల్ల తెలియక ఇలా చేసింది దానికి ఇంత బాధ పడాలా అని వాళ్ళ అమ్మ అనగానే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని శంకర్ అంటాడు. ఇక అక్కకి మాట ఇచ్చింది గుర్తుచేసుకుంటాడు శంకర్. తరువాయి భాగంలో జాను, సూర్య కలిసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

