
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 02 లో.....శంకర్ కుటుంబం గుడికి రెడీ అవుతారు. శారద ఇంకా ఎంతసేపు త్వరగా రమ్మని శంకర్ పిలుస్తాడు. ముగ్గురు కూతుళ్లు రెడీ అయి వస్తారు. ఎప్పుడెప్పుడు నా బంగారు తల్లి జానూని చూడాలని ఉందని శంకర్ అంటాడు. మీకు మా కన్నా జానూ అక్క అంటేనే ఎక్కువ ఇష్టమని గౌతమి అంటుంది. అదేం లేదు అందరు సమానమే కానీ మీ కంటే తనపై ఎక్కువ నమ్మకమని శంకర్ అంటాడు. అప్పుడే శంకర్ చిన్ననాటి ఫ్రెండ్ సింహాద్రి ఫోన్ చేసి.. దుబాయ్ నుండి వచ్చావా అని అడుగుతాడు. వచ్చానురా గుడికి వస్తున్నాను. అక్కడ కలుద్దామని శంకర్ చెప్తాడు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్ లో రైతులు గొడవచేస్తుంటే సింహాద్రి వాళ్లకి నచ్చజెప్పి వాళ్లకి గిట్టుబాటు ధర అయ్యేలా చేస్తాడు.
మరొకవైపు సూర్య కిచెన్ లో వాళ్ళ అమ్మకి ఇష్టమైన స్వీట్ చేసి తనపై ఉన్న కోపాన్ని పోగొట్టాలని అనుకుంటాడు. సూర్య వాళ్ళ అమ్మ సింహాద్రి చెల్లెలు భువన....తను కార్ దిగి లోపలికి వస్తుంది. స్వీట్ వాసన చూసి టెంప్ట్ అవుతుంది కానీ కోపంగా ఉంటుంది. అమ్మ నీ కోసం స్వీట్ అని సూర్య అంటాడు. కొడుకు వచ్చాడు తనకి నచ్చింది చెయ్యాలని ఏం ఉండదా అని సూర్య అనగానే నిన్ను ఎక్కడ అంటానోనని నన్నే రివర్స్ అంటున్నావా అని భువన అంటుంది. చదువు అంటూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నావ్ ఇప్పుడు కూడా దూరంగా ఉంటున్నావని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక నీకు పెళ్లి చేస్తానని భువన అంటుంది. అప్పుడే సూర్య తుమ్ముతాడు. ఏమైంది రా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఒకమ్మాయి నీళ్లలో తోసింది అని సూర్య అసిస్టెంట్ తుఫాన్ చెప్తాడు. ఎవరు ఆ అమ్మాయి అని భువన అడుగుతుంది. మీ అన్నయ్య చిన్ననాటి ఫ్రెండ్ శంకర్ కూతురు అని తుఫాన్ చెప్పగానే దాని సంగతి చెప్తానని అనుకుటుంది. ఆ తర్వాత సింహాద్రి తన చెల్లెలు భువనకి ఫోన్ చేసి ఈసారి జరిగే కర్రసాము పోటీకి నువ్వే చీఫ్ గెస్ట్ అమ్మ అని చెప్తాడు. అంటే గెలిచేది మీరే కాబట్టి నా చేతులతో ప్రైజ్ అందుకుంటారన్నమాట అని భువన అంటుంది.
ఆ తర్వాత సింహాద్రి తన ఫ్యామిలీని తీసుకొని గుడికి రెడీ అవుతాడు. మీ ఆత్రుత అంతా మీ ఫ్రెండ్ శంకర్ కోసమేగా నాకు తెలుసు అని సింహాద్రి భార్య అరుణ అంటుంది. మరొకవైపు సూర్య ఇంకా వాళ్ళ అమ్మ, తుఫాన్ గుడికి వస్తారు. అక్కడ సూర్యకి జానూ కన్పిస్తుంది. ఆ తర్వాత జానూ దేవుడికి మొక్కుకుంటూ.. తన నానమ్మ అన్నమాటలు గుర్తుచేసుకుంటుంది. సీతారాముల కళ్యాణం రోజు తొంబై తొమ్మిది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఆ అవకాశం కర్రసాము పోటీలో గెలిచిన కుటుంబానికి మాత్రమే ఛాన్స్. ఆంజనేయ స్వామికి అభిషేకం చెయ్యాలనేది మీ నాన్న కోరిక అని వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు జానూ గుర్తుచేసుకుంటుంది. ఈ రోజు ఎలాగైనా కర్రసాము పోటీలో గెలవాలి.. మా నాన్న ఆశ తీర్చాలని జానూ మొక్కుకుంటుంది. ఆ తర్వాత కర్రసాము పోటీలో పాల్గొనే వాళ్ళందరికి సింహాద్రి చెల్లెలు భువన అల్ ది బెస్ట్ చెప్తుంది. అక్కడే జానూ ఉంటుంది. వెంటనే భువన దగ్గరికి తుఫాన్ వచ్చి సూర్య బాబుని నీళ్లలో పడేసింది తనే అని చెప్తాడు. దాంతో కోపంగా మగాళ్లు అడే ఆటకి నువ్వు రావడం బుద్ది లేదా అని భువన అనగానే ఆడవాళ్లు తక్కువ అని అనేవాళ్ళకి బుద్ధి లేదని జానూ అంటుంది. దాంతో భువనకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
