
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో....రాత్రి ఎందుకు లేట్ గా వచ్చావని సూర్యపై భువన కోప్పడుతుంది. అదేం లేదమ్మా నువ్వు బిజినెస్ చూసుకోమ్మన్నావ్ కదా అందుకే రెసాట్ కి వెళ్లి అన్ని రిపేర్లు ఉంటే చేయించి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందని సూర్య చెప్తాడు. అయ్యో అవునా అని భువన అంటుంది. అప్పడే తుఫాన్ వచ్చి బాబు గారు మీరు రాత్రి దాబా దగ్గర మర్చిపోయిన బైక్ తీసుకొని వచ్చానని చెప్తాడు. దాబా దగ్గర ఎందుకు నీ బైక్ ఉందని భువన అడుగుతుంది.
రాత్రి ఈ తుఫాన్ తాగి పడిపోతే తీసుకొని వచ్చానని సూర్య చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో తుఫాన్ పై భువన కోప్పడుతుంది. మరొకవైపు మురళిపై శాంతి కోప్పడుతుంది. అప్పుడే మురళి దగ్గర పని చేసే అతను వస్తాడు. రాత్రి వీడే తాగమని చెప్పాడని మురళి తప్పించుకుంటాడు. ఆ తర్వాత మురళి డల్ గా ఉంటాడు. తన దగ్గరికి సూర్య వస్తాడు. అప్పుడే మురళి దగ్గర జానూ బ్లౌజ్ కుట్టించుకోవడానికి నందుని తీసుకొని వస్తుంది. మురళి దగ్గరికి నందు వచ్చి బావ ఇన్ని రోజులంటే నీ షాప్ ముందు నా ఫ్లెక్సీ ఉంటే పరవాలేదు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు కాబోయే భర్త చూస్తే బాగోదు అందుకే ఈ ఫొటోస్ అన్ని తీసేయ్ అని నందు చెప్పగానే మురళి సరే అంటాడు. నీ మీద నమ్మకం లేదు బావ అని నందు లోపలికి వెళ్లి ఫోటోస్ చింపిస్తుంది.
మరొకవైపు శంకర్ తన అక్కకి పెళ్లి పత్రిక ఇవ్వడానికి శారదని తీసుకొని వెళ్తాడు. శారద చేతిలో తాంబూలం చూసిన శాంతి.. మళ్ళీ నందుని మురళికి ఇవ్వడానికి అడగడానికి వచ్చారనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నీ మేనకోడలు పెళ్లిపత్రిక అని శంకర్ అనగానే శాంతి షాక్ అవుతుంది. వెంటనె తెచ్చిన తాంబూలం విసిరేస్తుంది. అప్పుడే అక్కడికి సూర్య, మురళి వస్తారు. తరువాయి భాగంలో నువ్వే పెళ్లి పనులు చూసుకోవాలని మురళికి శంకర్ చెప్తాడు. ఆ ఇంటికి వెళ్ళనని మాటివ్వమని మురళితో శాంతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






