.webp)
బిగ్ బాస్ సీజన్-10 తెలుగు స్టార్ట్ అయిన వేళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.ఇన్స్టాగ్రామ్లో bigboss10teluguofficial పేజ్ షేర్ చేసిన ఆ పోస్ట్ లో అఖిల్ ఏమన్నాడంటే."కొంతమంది ఫేమ్ కోసం ఎంత దిగజారిపోతారంటే, బజ్ లో ఉండటానికి ఏదైనా చేస్తారు. కొత్త సీజన్ నడుస్తోందని, తమ గురించి ఎవరూ మాట్లాడటం లేదని తెలిసి, సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ గా అయినా, పాజిటివ్ గా అయినా అటెన్షన్ కోసం స్టోరీలు క్రియేట్ చేస్తారు. హఠాత్తుగా వచ్చిన ఫేమ్ తో ఇన్ సెక్యూరిటీ వస్తుందని నాకు అర్థమవుతుంది. కానీ ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. ఏళ్ల తరబడి రెలెవెంట్ గా ఉండటానికి ఇతరులను నిందించలేరు.15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా నేను ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లను తొక్కేసి బజ్ లోకి రావాలని చూడలేదని అన్నాడు.
అఖిల్ సార్థక్ అంతటితో ఆగకుండా మరో పారా రాసుకొచ్చాడు. ఇంకో విషయం, నా ఫ్రెండ్ తో నా రిలేషన్ గురించి స్టోరీలు క్రియేట్ చేసి, ఆమె వేరే అబ్బాయిలతో కనిపించిందని ట్రోల్ చేసే వాళ్లు తమ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఒక మగాడికి ఫిమేల్ ఫ్రెండ్స్ ఉంటే నార్మల్, కానీ ఒక అమ్మాయికి మగ ఫ్రెండ్స్ ఉంటే వెంటనే ఆమె క్యారెక్టర్ ని ప్రశ్నిస్తారు ఎందుకు.. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఏ. ఒక అమ్మాయి అబ్బాయిలతో కనిపించినంత మాత్రాన ఆమెను జడ్జ్ చేసే, షేమ్ చేసే హక్కు ఎవరికీ లేదు. అమ్మాయిలకు, అబ్బాయిలకు ఒకే రూల్ ఉండాలి.ఒకరి జెండర్ ని బట్టి మీ మైండ్ సెట్ మారుతుంటే, ప్రాబ్లం వాళ్ల క్యారెక్టర్ కాదు, మీదే. What a mindset" అంటూ అఖిల్ ఘాటుగా స్పందించాడు.
.webp)
ఈ పోస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన పేరు వాడుకుని ఫేమ్ తెచ్చుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి అఖిల్ ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




