
బిగ్ బాస్ తెలుగు సీజన్-4 కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సీజన్ లో వీరిద్దరి బాండ్, లవ్ ట్రాక్ ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలుసు. షో అయిపోయి ఏళ్లు గడుస్తున్నా వీరి ఫ్రెండ్షిప్ ఇంకా అలానే కొనసాగుతోంది. తాజాగా అఖిల్ సార్థక్ తన ఇన్ స్టా స్టోరీలో మోనాల్ పై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మోనాల్ తో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేశాడు. ఒక వీడియోలో ఇద్దరూ చేయి పట్టుకుని స్టేజ్ మీద నడుస్తున్న కొన్ని వీడియోస్ ని షేర్ చేస్తూ దానిపై "But I'm stuck in season 4" అని క్యాప్షన్ పెట్టాడు. మరో వీడియోలో బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరూ కలిసి కూర్చున్న క్లిప్ ని షేర్ చేశాడు. ఈ రెండు వీడియోలపై.. This friendship will always will be pure has your love to us!! @monal_gajjar అని ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. దీంతో అఖిల్ ఇంకా సీజన్-4 మెమోరీస్ లోనే ఉండిపోయాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ స్వచ్ఛంగా ఉందని, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని అఖిల్ చెప్పడం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. మోనాల్ - అఖిల్ జోడీని మళ్లీ చూడాలని ఉందని నెటిజన్లు అంటున్నారు.
ప్రస్తుతం అఖిల్ సార్థక్ తన ప్రాజెక్టుల గురించి బిజీగా ఉన్నా, మోనాల్ తో ఉన్న బాండ్ ను మాత్రం మర్చిపోలేదు. ఈ స్టోరీ చూసిన తర్వాత మోనాల్ కూడా రియాక్ట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Akhil Sarthak Monal Gajjar Friendship, Akhil Sarthak Instagram Story Viral, Bigg Boss Telugu Season 4 Memories, Monal Gajjar Akhil Sarthak Latest News




(3).webp)
