Home

»

Tv News

నవ్య స్వామి ఫ్యామిలీలో విడాకుల వార్తలు.. ఐశ్వర్య పిస్సే ఏమన్నారంటే?

Oct 15, 2026 2:34PM


 తెలుగు, కన్నడ బుల్లితెర ఆడియన్స్ కి  సుపరిచితమైన యాక్టర్ ఐశ్వర్య పిస్సే తన పర్సనల్ లైక్ కి  సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పింది.  తన భర్త హరి వినయ్‌తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆఫీషియల్ న్యూస్ ని రివీల్ చేసింది . కొంతకాలంగా వీరిద్దరి వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లకు ముగింపు పలుకుతూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో బుల్లితెర అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఐశ్వర్య పిస్సే కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కి  బాగా దగ్గరయింది.  ‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌తో  గుర్తింపు తెచ్చుకుని  ‘అగ్నిసాక్షి’ సీరియల్‌తో తెలుగు ఆడియన్స్ కి  దగ్గరైంది.  కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే ఐశ్వర్య హరి వినయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

2019లో వీరి వివాహం జరిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. హరి వినయ్ మరెవరో కాదు.. తెలుగు సీరియళ్లు, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య స్వామికి  సోదరుడు.  అందుకే ఐశ్వర్యను సరదాగా తన ‘హాఫ్ హజ్బెండ్’ అని పిలుస్తూ ఉంటుంది నవ్యస్వామి.  కొంతకాలంగా ఐశ్వర్య, హరి వినయ్ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి . వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారని  పుకార్లు వినిపించాయి. ఆ విషయాన్నీ ఇప్పుడు ఐశ్వర్య బయటపెట్టింది.  తమ నిర్ణయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు అర్థం చేసుకుని గౌరవించాలని కోరింది.  సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఐశ్వర్య ఫైర్ అయ్యింది . ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, తన సీరియళ్లలోని సన్నివేశాలను సందర్భానికి సంబంధం లేకుండా ఉపయోగించడం, తన వ్యక్తిగత పరిస్థితిని ప్రచారానికి వాడుకోవడం సరికాదని స్పష్టం చేసింది.

తెరపై కనిపించే పాత్రలకు, నిజ జీవితానికి మధ్య తేడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరింది. సీరియళ్లలోని సన్నివేశాలను తన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి కథ

నాలు రూపొందించవద్దని విజ్ఞప్తి చేసింది.
తన పని, వృత్తి ప్రజలకు కనిపించేవి కావొచ్చని, కానీ తన వ్యక్తిగత జీవితం మాత్రం ప్రైవేటు విషయమని ఐశ్వర్య స్పష్టం చేసింది. తన పరువుకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటానని కూడా  హెచ్చరించింది. ఇలాంటి చర్యలు కొనసాగితే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొంది.
 ----------
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com