Home

»

Tv News

Brahmamudi : సీఈఓ పీఠం కోసం కొత్త కుట్రలు.. ఇందూని అడ్డుకోవాలని ఐశ్వర్య ప్లాన్!

Jun 5, 2026 11:32AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1050 లో.....ఇందు అంటూ ఐశ్వర్య పిలుస్తూ వస్తుంది. ఇందు పలకకపోయేసరికి ఏంటే నీ కళ్ళు నెత్తికెక్కాయా.. స్టోర్ రూమ్ లో ఉండేదానివి బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి పొగరు వచ్చిందా.. అవునులే ఇప్పుడు పెళ్లి అయింది భర్త ఉన్నాడు.. ఆ మాత్రం ఉంటుందిలే అని ఐశ్వర్య అంటుంది. ఏంటి ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఐశ్వర్యని ఇందు కోప్పడుతుంది. కుక్కినపేనులా పడిఉండేదానివి నోరులేస్తుందేంటే అని ఇందుపై ఐశ్వర్య కోప్పడుతుంది.

మరొకవైపు ఆంటోనీ ఫుల్ గా తాగి పడుకుంటాడు. అతని దగ్గరికి లక్కీ వెళ్తాడు. ఆంటోనీ దగ్గర ఫొటో ఉంటుంది. ఏంటి ఇది అని లక్కీ చూడబోతుంటే అప్పుడే ఆంటోనీ లేచి దానిని లాక్కుంటాడు. ఏంటి ఈ ఫొటో అని లక్కీ ఆడుగుతాడు. ఇది నా పర్సనల్ అని ఆంటోనీ అంటాడు. మా అమ్మ గురించి కనుక్కుంటానన్నావ్.. ఏమైందని లక్కీ అడుగుతాడు. కనుక్కుంటా నాకు అవసరం అయినవన్నీ తీసుకొని రా అని చెప్పి వెళ్తాడు. అసలు ఆ ఫోటోలో ఎవరు ఉందని లక్కీ అనుకుంటాడు. మరొకవైపు ఈ ఫోటోలో ఉంది.. మీ అమ్మ కొద్దిలో మిస్ అయ్యావని లక్కీ గురించి ఆంటోనీ అనుకుంటాడు.ఆ తర్వాత ఇందు పూజ చేస్తుంది. అపర్ణ, సుభాష్ దగ్గరికి ఇందు వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడే రాజు వెళ్తాడు. ఇప్పటివరకు మీ మనవరాలు స్టోర్ రూమ్ లో ఉండేది. ఇప్పుడు బెడ్ రూమ్ లోకి షిఫ్ట్ చేసాను.. ఇక ఈ ఇంటికి పట్టిన బూజుదులిపి మీ మనవరాలిని మహారాణిని చేస్తానని రాజు అనగానే అపర్ణ, సుభాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఇక అపర్ణ మాట్లాడుతుంటుంది. ఈవిడ మాట్లాడుతుంటే ఏదో దగ్గరి వాళ్ళు మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపిస్తుందని రాజు అనుకుంటాడు. ఈవిడకి దూరంగా ఉండాలి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అవుతుందని రాజు అనుకుంటాడు. ఆ తర్వాత భూషణ్, భ్రమరాంబ, రేఖ, శేషు మాట్లాడుకుంటారు. రాజు గాడి ప్లాన్ సక్సెస్ అవొద్దు.‌ అలా జరగాలంటే ఇందుని సీఈఓ చెయ్యాలని రేఖ అంటుంది. ఆ మాటలు ఐశ్వర్య విని ఇందు సీఈఓ అవ్వకుడదు.. అసలు అది ఆఫీస్ కి వెళ్ళకూడదని రౌడీలకి కాల్ చేసి చెప్పిన లొకేషన్ రమ్మని చెప్తుంది. ఆ తర్వాత రాజు ఆఫీస్ కి రెడీ అవుతాడు. శేషు తనని కొన్ని ఫొటో స్టిల్స్ తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com