Home

»

Tv News

Agnipariksha season2 : స్టాండ్ లేని చరణ్ పై జ్యూరీ ఫైర్.. టాస్క్ లో దుమ్మురేపిన హేమంత్!

Sep 4, 2026 12:04PM

డేంజర్ జోన్ ఫైనల్ అయ్యాక జ్యూరీ ఇద్దరిద్దరుగా జట్టు కట్టాలని చెప్పింది. నలుగురు ఉన్నారు కాబట్టి రెండు టీంలుగా విడిపోతేనే టాస్క్ చేయగలరని రూల్ పెట్టింది. ఎవరికి ఎవరితో ఆడాలని ఉందని అడిగినప్పుడు అసలు డ్రామా మొదలైంది. చరణ్ ఏమో రామకృష్ణ పేరు చెప్పాడు.. రామకృష్ణ కూడా చరణ్ పేరే చెప్పాడు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండటంతో కలిసే ఆడాలనుకున్నారు. దీంతో హేమంత్ కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

 

హేమంత్ దగ్గర భాగి తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో నాకు ఆప్షన్ లేదు కాబట్టి భాగితో ఆడతానని చెప్పాడు. అయితే జ్యూరీ ఇక్కడ ఒక అవకాశం ఇచ్చింది. కావాలంటే చరణ్ ని కన్విన్స్ చేసుకోమని హేమంత్ తో చెప్పింది. హేమంత్ వెళ్లి చరణ్ తో మాట్లాడేసరికి చరణ్ మొదట కన్విన్స్ అయి హేమంత్ తో ఆడతానని ఓకే చెప్పాడు. కానీ జ్యూరీ మళ్లీ ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యావని ప్రశ్నించేసరికి చరణ్ మళ్లీ మాట మార్చేశాడు. చివరకు మళ్లీ అడుగుతున్నాం అన్నప్పుడు రామకృష్ణ పేరే చెప్పాడు.

 

దీంతో జ్యూరీకి కోపం వచ్చింది. అసలు మీరు ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ తల పట్టుకున్నారు. ఒక్క స్టాండ్ మీద ఉండరా అని చరణ్ ను గట్టిగా తిట్టారు. ఈ స్టాండ్ లేని తత్వం బిగ్ బాస్ హౌస్ లో నెగెటివ్ అవుతుందని జ్యూరీ హెచ్చరించింది. ఆ తర్వాత మెమరీ పవర్ ను టెస్ట్ చేసే టాస్క్ పెట్టారు. కొన్ని ఆడియోలు, వీడియోలు ప్లే చేసి పాటలో ఎన్ని పదాలు ఉన్నాయి.. వీడియోలో ఏం కనిపించిందని ప్రశ్నలు వేశారు. ఇది పూర్తిగా కాన్సన్ట్రేషన్ టాస్క్.

 

ఈ టాస్క్ లో భాగి దారుణంగా ఫెయిల్ అయింది. ఒక్క పాయింట్ కూడా తేలేకపోయింది. ఆమెకు బదులు హేమంత్ ఒక్కడే జట్టును లాగాడు.. అదరగొట్టాడు. అవతల చరణ్ బాగా ఆడుతున్నా రామకృష్ణ వల్ల పాయింట్లు మిస్ అవుతూ వచ్చాయి. చివరి కీలక పాయింట్ ను మాత్రం రామకృష్ణ సాధించడంతో చరణ్, రామకృష్ణ టీమ్ విన్ అయింది. ఈ గెలుపు తర్వాత కూడా ఎవరు సేవ్ అవ్వాలో హేమంత్, భాగి చేతిలో పెట్టారు. వాళ్ళు చరణ్ ను సేవ్ చేశారు. ఆ తర్వాత డైస్ రోల్ టాస్క్ లో భాగికి 6 నంబర్ పడకపోవడంతో హేమంత్ మళ్లీ గెలిచాడు. అపూర్వ హేమంత్ కు, షాలినీ భాగికి సపోర్ట్ చేసినా ఫలితం మారలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com