.webp)
అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా సాగుతుంది.ఇద్దరు లీడర్లు ఫైనల్ అయ్యాక అసలు కథ మొదలైంది. ఒక పక్క షాలినీ, ఇంకో పక్క ఝాన్సీ. షాలినీ టీంలోకి రాజకుమారి, శ్రష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ వచ్చేశారు, ఝాన్సీ టీంలోకి హేమంత్, రామకృష్ణ, గాయత్రి, మిథిలేష్, దీపక్, ప్రియాంక ఉన్నారు. చూడటానికి షాలినీ టీంలో ఎక్కువ మంది స్ట్రాంగ్ అనిపించినా ఝాన్సీ టీంలో కూడా పట్టుదల ఉన్నోళ్లే ఉన్నారు.
ఈ రెండు టీమ్స్ మధ్య పెట్టిన టాస్క్ మామూలుగా లేదు. 90 డిగ్రీస్ యాంగిల్ లో మోచేయి వంచకుండా చేతులు పట్టుకొని హోల్డ్ చేయాలి. ఎవరు గెలిచినా ఓడినా ఒక్కరికి మాత్రమే ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. టాస్క్ మొదలవ్వగానే చాలామంది తడబడ్డారు. కొందరు మోచేయి వంచేస్తున్నారు. మరికొందరు చేతులు కిందకు దించేస్తున్నారు.
జ్యూరీ అయితే చాలా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు. యాంగిల్ తప్పిన వెంటనే.. ప్రియాంక వదిలేయ్, శ్రష్టి వదిలేయ్, అమన్, గాయత్రి, రాజకుమారి వదిలేయండి అని ఒకరి తర్వాత ఒకరిని ఔట్ చేస్తూ వచ్చారు. కొద్దిసేపటికే ఇద్దరు టీమ్స్ లో చాలామంది ఖాళీ అయిపోయారు. లాస్ట్ కి షాలినీ టీం నుండి చరణ్ ఒక్కడే మిగిలాడు. వాడు అయితే చాలా అద్భుతంగా హోల్డ్ చేశాడు. కానీ ఝాన్సీ టీం నుండి మిథిలేష్, హేమంత్ ఇంకా సూపర్ గా నిలబడ్డారు. ఇద్దరు vs ఒకడు అయిపోయింది. చాలాసేపు ట్రై చేసినా చరణ్ కి ఓపిక నశించి చివరకు చేతులెత్తేశాడు. దీంతో ఝాన్సీ టీం విన్ అయింది.





.webp)
