(3).webp)
బిగ్ బాస్ కి వెళ్ళాలనేది ఎంతో మంది కల కానీ అది అందరికి దక్కదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన రాజకుమారికి ఆ అవకాశం దక్కింది. తన జీవితం గురించి రాజకుమారి అగ్నిపరీక్ష స్టేజ్ మీద చెప్తుంటే అటు జడ్జెస్ ఇటు ఆడియన్స్ ఫిధా అయ్యారు.
అగస్ట్ పదిహేను నుండి మొదలైన అగ్నిపరీక్షలో టాప్-15 కంటెస్టెంట్స్ కోసం సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో రాజకుమారి వచ్చింది. తన చిన్నప్పుడే ఇష్టం లేకుండా మామకి ఇచ్చి పెళ్లి చేశారంట.. నల్లగా ఉందని చెప్పి ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నాడంట.. తర్వాత ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇంకో పెళ్లి చేశారంట. కానీ ఆయన కూడా సరిగా బాధ్యత తీసుకోలేకపోవడంతో ముగ్గురు పిల్లలతో రోడ్డు మీద నిలబడింది రాజకుమారి. అప్పటి నుంచి ఒంటరిగా కష్టపడి, టైలరింగ్ చేసుకుంటూ పిల్లల్ని పెంచుతుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. ఫిల్టర్ లేకుండా, మేకప్ లేకుండా వీడియోలు చేస్తుంది. ఇన్‌స్టాలో లక్ష ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఒకసారి యాక్సిడెంట్ లో మొహం, ఎముక ఇరిగిపోయింది. ఆ టైంలో పిల్లలు కూడా దగ్గరికి రాలేదు. అద్దంలో తనని తాను చూసుకోలేకపోయింది. అయినా ప్రాణం పోలేదు కదా అని మళ్ళీ లేచింది. భయం అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా కొట్టింది రాజకుమారి.
బిగ్ బాస్ స్టేజ్ మీద ఏడ్చుకుంటూ తన బాధ అంతా చెప్పింది. పిల్లల్ని చదివించాలంటే డబ్బు కావాలి. బిగ్ బాస్ కి వస్తే నా కల నెరవేరుతుందని చెప్పింది. బిందు మాధవి పేపర్ల మీద "హజ్బెండ్" అని రాసి ఇచ్చి, వాటిని చింపేసి బాధ బయటకు పంపమంది. రాజకుమారి మాటలు విని నవదీప్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి ముగ్గురు జడ్జ్ లు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ తో ర్యాంప్ చేసి.. ఐ లవ్యూ అని చెప్పి స్టేజ్ దిగింది రాజకుమారి.




(1).webp)
(1).webp)
