
తేజస్విని మడివాడు బుల్లితెర మీద కాకమ్మ కథలు షో ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కాకమ్మ కథలు షో గురించి బిగ్ బాస్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. కాకమ్మ కథలో షోలో ఎవరు వస్తున్నారు వాళ్ళ కథేంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతూ ఉన్న టైములో ఆడియన్స్ తన గురించి ఎక్కువ తెలుసుకున్నట్లు చెప్పింది. ఐతే బిగ్ బాస్ కానీ ఇతర రియాలిటీ షోస్ లో మాత్రం స్క్రిప్ట్ ప్రకారం వెళ్లడమే కాబట్టి తన గురించి పెద్దగా ఏమీ ఉండదు అని చెప్పింది. ఇక బిగ్ బాస్ అంటే కొట్టుకోవడానికి లోపలి వెళ్ళేది అంది. 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు హౌస్ లోకి వెళ్లాను. అక్కడికి వెళ్లి పెద్ద ముత్తైదువులా కూర్చోలేను కదా. అప్పుడు రారా కొట్టుకుందాం అన్నాను తర్వాత 30 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్లాను. హే మీరు కొట్టుకోండిరా అన్నాను. కాకమ్మ కథలకు థాంక్స్ చెప్పాలి. ముందు ఏడ్చేదాన్ని అందరూ నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని. తర్వాత అన్నీ చేంజ్ అయ్యాయి.
టాలీవుడ్ తేజస్వినిని జడ్జ్ చేసి వర్క్ ఇవ్వలేదు. సీతమ్మ వాకిట్లో మూవీలో క్యూట్ పెర్ఫార్మెన్స్ తర్వాత 40 సినిమాలు వచ్చాయి. 45 సినిమాలు 4 వెబ్ సిరీస్ లు చేసాను 10 రియాలిటీ షోస్ చేసాను. 21 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు నా వయసు 35. నాకు కళామ తల్లి కానీ, టాలీవుడ్ కానీ , నాకు నేను ద్రోహం చేయలేదు చేసుకోలేదు. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవి . నేను రామ్ గోపాల్ వర్మ సినిమా చేయగానే అందరూ షాకై ఈ పిల్లతో వద్దు అనుకున్నారు. అది తనను బాధపెట్టిందని చెప్పింది. ఒక సినిమా బట్టి తన క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారు అని ప్రశ్నించింది. "నేను మిస్ హైదరాబాద్ అని ఒకటి ఉంది. అందులో "మిస్ టాలెంటెడ్ ". "డాబర్ గులాబరి ఫ్రెష్ ఫేస్ సెగ్మెంట్ "లో నేను రన్నరప్ గా వచ్చాను. ఫస్ట్ రన్నరప్ రీతూ వర్మ... సెకండ్ నేను. కాలేజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు డాబర్ గులాబరి చేసాను ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో మూవీ చేసాను.





