Home

»

Tv News

సాయి ధరమ్ తేజ్ కండలపై మోజు పడిన శ్రీముఖి... లక్ష కావాలంటూ డిమాండ్

Oct 23, 2026 3:03PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ వచ్చి మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. ఇక శ్రీముఖి ఆయన్ని రోస్ట్ చేస్తే ఆయన సాయి ధరమ్ తేజ్ ని రోస్ట్ చేశారు. "మీ  లిస్ట్ లో ఉన్న కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నాం " అంది శ్రీముఖి. వెంటనే థమన్ "అఖిల్, సాయి ధరమ్ తేజ్ " అని చెప్పాడు.

వెంటనే శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. "మీరు సాయి ధరమ్ తేజ్ గారికి ఫోటీనే చేసి వెంటనే ఒక లక్ష రూపాయలు కావాలని చెప్పండి. ఆయన అసలు ఒప్పుకుంటారా లేదా ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం " అని చెప్పింది. దాంతో థమన్ ఫుల్ కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. వెంటనే సాయి ధరమ్ తేజ్ కి ఫోన్ చేసి "అరేయ్ నువ్వు నా ఫ్రెండ్ వేనా నాకొక ప్రాబ్లమ్ ఉంటే హెల్ప్ చేస్తావా లేదా.. నాకు అర్జెంట్ గా ఒక లక్ష రూపాయలు కావాలి. పొద్దున్న కల్లా ఇచ్చేస్తాను  " అన్నాడు. "అంత ఫాస్ట్ గా ఎలా ఇస్తాం రా" అన్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంతలో శ్రీముఖి ఎంతోకొంత అంటూ గుసగుసలాడేసరికి "పక్కనుంచి ఎవర్రా ఆ అమ్మాయి " అని అడిగాడు తేజ్.

"రేయ్ అసలు నీకు స్మెల్ కూడా వస్తుందా ఫోన్ లో. ఒక అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడుతోంది. పెళ్లి చేసుకుంటావా" అని అడిగాడు థమన్. "ఎవరు " అని తేజ్ అనేసరికి శ్రీముఖి ఫోన్ తీసుకుని "మీరంటే చాల ఇష్టం అండి . ముఖ్యంగా మీ కండ లంటే చాలా ఇష్టం అండి"  అంది. "థాంక్యూ అండి . మా వాడి కండలు  ఇంకా బాగుంటాయి అండి " అన్నాడు తేజ్. "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని నిరూపించావురా. ఆఫ్ రింగ్ లో ఫోన్ తీసావు చూడు " అన్నాడు థమన్. వెంటనే శ్రీముఖి "కానీ ఇంతకు రేపు లక్ష ఇస్తారా లేదా అనేదే పాయింట్ " అనేసరికి "లక్ష ఏంటి కోట్లే ఇస్తాడు " అన్నాడు థమన్. దాంతో తేజ్ "ఒరేయ్ " అంటూ గట్టిగా అరిచాడు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com