Home

»

Tv News

ఆదివారం పరివారంలో పొదరిల్లు 100 డేస్ ఫంక్షన్!

May 20, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో ఒక సీరియల్ ఫంక్షన్ చేశారు.  "ఇన్ని డేస్ సినిమాకు 100 డేస్ చేయడం చూసుంటారు. కానీ మొదటి సారి పొదరిల్లు అనే సీరియల్ కి 100 డేస్ ఫంక్షన్" అంటూ శ్రీముఖి చెప్పింది. ఇక ఈ సీరియల్ లో మహాలక్ష్మి రోల్ లో నటిస్తున్న కృతిక వచ్చి "రామ్ గారు చేసిన సినిమా స్కంద. మా పొదరిల్లు కొట్టింది 100 " అని అదిరిపోయే డైలాగ్ ని తన సీరియల్ మీద చెప్పింది. "పొదరిల్లు కొట్టింది సెంచరీ. ఈరోజు సెలెబ్రేషన్స్ తో అదరగొడతాము హిస్టరీ" అంటూ శ్రీముఖి చెప్పింది.

ఇక ఈ సీరియల్ కాస్ట్ అంతా వచ్చి కేక్ కట్ చేసింది. పొదరిల్లు సీరియల్ 2025 డిసెంబర్ 8 నుంచి స్టార్ మాలో మొదలయ్యింది. ప్రధాన రోల్ లో దీపక్ కుమార్ అలియాస్ చక్రి నటిస్తున్నాడు. కృతిక హీరోయిన్ గా మహాలక్ష్మి రోల్ లో నటిస్తోంది. బృందావనం అనే ఇంట్లో నారాయణ ఇంటి పెద్ద. అతనికి భార్య చనిపోతుంది.  అతనికి నలుగురు కొడుకులు.

అతనొక తాగుబోతు. అతని చెల్లికి ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో నారాయణ పిల్లలకు శాపం పెడుతుంది వాళ్లకు పెళ్లిళ్లు కావు అని. ఐతే ఆ ఇంటికి ఒక అమ్మాయి కోడలిగా వస్తుంది. ఆమె ఈ జీవితాన్ని మార్చే పనిలో అందరినీ సెట్ రైట్ చేసే పనిలో పడుతుంది. అదే సీరియల్ థీమ్. ఇక ఇప్పుడు ఈ సీరియల్ మొదలై 100 డేస్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com