Home

»

Tv News

1 మిలియన్ సంబరం: బిగ్ బాస్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన ఆదిరెడ్డి!

Oct 4, 2026 2:19PM

బిగ్ బాస్ తెలుగు 6 ఫేమ్ ఆదిరెడ్డి మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన సోషల్ మీడియాలో 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల మార్క్ ని దాటడంతో ఎమోషనల్ గా స్పందించాడు. తనకు ఈ గుర్తింపు, ఈ ఫాలోయింగ్ రావడానికి కారణం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశమే అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

నా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు, గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు బిగ్ బాస్ 6 తెలుగులో కంటెస్టెంట్ గా అవకాశం ఇచ్చిన స్టార్ మా కి, జియో హాట్ స్టార్ తెలుగుకి ధన్యవాదాలు అంటూ ఆదిరెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నాడు. దీనికి బిగ్ బాస్ 10 తెలుగు అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు.

ఆదిరెడ్డి ఈ పోస్ట్ పెట్టిన గంటలోనే 19.9 వేల లైక్ లు, 1162 కామెంట్లు, 197 షేర్లు వచ్చాయి. మమతా వేణి తో పాటు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు లైక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్-6 లో తన పల్లెటూరి యాస, ఆటతీరు, కామెడీ టైమింగ్ తో ఆదిరెడ్డి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ షో తర్వాతే తనకు ఇంత ఫాలోయింగ్ పెరిగిందని, ఇప్పుడు 1 మిలియన్ ఫ్యామిలీ అయినందుకు చాలా సంతోషంగా ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ 10 తెలుగు నడుస్తున్న సమయంలో పాత కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఇలా థాంక్స్ చెప్తూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. బిగ్ బాస్ తన జీవితాన్ని మార్చేసిందని ఆదిరెడ్డి ఎప్పుడూ చెప్తుంటాడు. ఇప్పుడు 1 మిలియన్ వేడుకలో మరోసారి అదే విషయాన్ని గుర్తుచేశాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com