Home

»

Tv News

గర్ల్‌ఫ్రెండ్, వర్జినిటీ, బాడీ కౌంట్ పై  జతిన్‌ను ప్రశ్నించిన అభి మాస్టర్

Oct 10, 2026 6:01PM

 ఢీ డాన్స్ షోలో అభి మాష్టర్, జతిన్ ఇద్దరూ వాళ్ళ వాళ్ళ డాన్స్ లతో, పెర్ఫార్మెన్స్  లతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఢీ డబుల్ ఇంపాక్ట్ షో స్టార్ట్ అయ్యాక చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లిపోయారు. అభి మాష్టర్ ఇక విజయవాడ వచ్చేసాడు. ఐతే రీసెంట్ ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. అతనితో పాటు జతిన్ కూడా జత కట్టాడు. అలా ఈ ఇద్దరూ కలిసి ఈవెంట్ కి వెళ్లే టైములో అభి మాష్టర్ కొన్ని "ఆస్క్ మీ క్వశ్చన్స్ " ని జతిన్ ని అడిగాడు. అలాగే వాటిని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు.

ఇక అభి ఏమడిగాడో జతిన్ ఎం చెప్పాడో చూద్దాం. "నీ గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా " అన్నాడు. "ఇప్పుడా మళ్ళీ గర్ల్ ఫ్రెండా " అంటూ దణ్ణం పెట్టేసాడు. దాంతో నవ్వాపుకోలేకపోయాడు అభి మాష్టర్. అదేంటి అస్సలు గర్ల్ ఫ్రెండ్ వద్దా అన్నాడు. "అస్సలు వద్దు ఇలాగే బాగుంది " అన్నాడు జతిన్ . "ఢీ లో కూడా ఇలాగే చెప్పాడు. ఇక్కడా ఇదే చెప్పాడు. ఎప్పటికీ ఇదే చెప్తాడు " అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత "ఢీ 20 తర్వాత ఎం చేస్తున్నావ్" అని అడిగాడు. "ఢీ తర్వాత ఫేమ్ వచ్చింది. ఈవెంట్స్  చేస్తున్నా బెంగళూరులో మూవీస్ కి అసిస్ట్ చేస్తున్నా.  అలా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా" అని చెప్పాడు.

"నీ బాడీ కౌంట్ ఎంత " అని అడిగాడు అభి. దానికి జతిన్ "జీరో" అని చెప్పి ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. "నీ వర్జినిటీ ఎప్పుడు పోయింది" అని అడిగాడు. "నేను వర్జిన్ " అని చెప్పాడు. "చాలా సేఫ్ ఆన్సర్స్ ఇస్తున్నాడు సరే అది వదిలేయ్ ఢీ 20 ఎలిమినేషన్ తర్వాత నువ్వు ఎలా ఫీలయ్యావ్ " అని అడిగాడు. "ఫినాలే వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యేసరికి చాలా బాధేసింది. కానీ కొరియోగ్రాఫర్ గా , కంటెస్టెంట్ గా ఇంత దూరం వచ్చాను అది హ్యాపీ" అని చెప్పాడు. "నిజమే జతిన్ లా తానే కంపోజ్ చేసుకుని కొరియోగ్రాఫ్ చేసుకోవడం ఎవరి వల్లా కాదు..జనాలు కూడా రియల్ విన్నర్ జతిన్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. " అని చెప్పాడు అభి మాష్టర్.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com