
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -207 లో..... భాను సంవత్సరికం జరగకుండా ఆపాలని వీరు ప్లాన్ ని రుద్ర తిప్పి కొడతాడు. సంవత్సరికం జరుగుతుంటే రుద్ర చాటు నుండి చూస్తాడు. కార్యక్రమం పూర్తి అయ్యాక అందరు ఇంటికి వెళ్తారు. రుద్ర పంతులు దగ్గరికి వెళ్తాడు. మీరెవరని పంతులు అడుగుతాడు. భానుకి బాగా కావల్సిన వాడిని అని రుద్ర అంటాడు. అవును తన కోరికలు తీరకుండా వెళ్ళాడు కదా అందుకే పాపం పిండం కాకులు కూడా ముట్టలేదని పంతులు అంటాడు. అప్పుడే కాకి వచ్చి పిండం ముడుతుంది. మీరే తనకి ఇష్టమైన వాళ్ళు అనుకుంటా.. మీరు వచ్చాకే కాకి పిండం ముట్టిందని పంతులు అంటాడు.
తన ఆత్మ శాంతించాలంటే ఏం చెయ్యాలి పంతులు గారు అని రుద్ర అడుగుతాడు. తన కోరికలు ఏంటో తెలుసుకొని నెరవేర్చాలని పంతులు చెప్తాడు. ఆ తర్వాత రుద్ర ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కోవడానికి వీరు ఇంటికి వస్తాడు. గంగ, ప్రీతీ మాట్లాడుకుంటుంటే.. అప్పుడే వీరు వస్తాడు. వీరుకి ఉన్న దెబ్బలు చూసి.. అయ్యో ఏమైందని ప్రీతీ అడుగుతుంది. ఆ విషయం తర్వాత ముందు బావ ఎక్కడ అని వీరు అడుగుతాడు. గదిలో ఉన్నాడని చెప్పినా వినకుండా వీరు వెళ్తాడు. డోర్ కొడుతాడు. డోర్ తియ్యకపోయేసరికి డోర్ బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్తాడు. అప్పుడే రుద్ర బాత్రూం నుండి బయటకు వస్తాడు. ఏమైందని రుద్ర అడుగుతాడు. మీరు ఒంటరిగా ఉండి బాధపడుతున్నారని అన్నయ్య పాపం ఫీల్ అవుతున్నాడని గంగ అంటుంది. రుద్ర ఏం తెలియనట్లు ఆ దెబ్బలు ఏంటని అడుగుతాడు. దాంతో వీరు జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత వీరు, ప్రీతి అక్కడ నుండి వెళ్ళిపోయాక పంతులు చెప్పింది మొత్తం గంగకి చెప్తాడు రుద్ర.
ఆ తర్వాత ప్రమీల బాధపడుతుంటే పెద్దసారు చూసి బాధపడుతాడు. ఇంట్లో అందరు జంటలుగా సంతోషంగా ఉన్నారని బాధపడుతాడు. అప్పుడే శకుంతల వస్తుంది. మనం ప్రమీలకి ఒక కొత్త జీవితం ఇవ్వాలి.. పెళ్లి చెయ్యాలని పెద్దసారు అనగానే వద్దు ఎప్పటికి ప్రమీల నా కోడలుగా, భాను భార్యగానే ఉండాలని శకుంతల అంటుంది. ఆ మాట ఇషిక విని వీరుకి చెప్తుంది. ప్రమీలకి పెళ్లి అని ఆలోచన రాకుండా చెయ్యాలని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







