ENGLISH | TELUGU  
Home  » TV News

33 వ పుట్టినరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు...బాబా, పాప ఎవరో త్వరలో చెప్తాం

on Feb 14, 2026

 

 


శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క ఒక బిడ్డను ప్రసవించింది. బుల్లితెర ఆడియన్స్ కి తీన్మార్ సావిత్రిగా పరిచయం ఐన తన యాస భాషతో అందరినీ ఎంటర్టైన్ చేసేది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ తర్వాత ఒక వెలుగు వెలిగింది. అన్ని రకాల షోస్ లో జ్యోతక్క కనిపించడమే కాదు వెంట భర్తను కూడా తీసుకొచ్చేది. అలాగే ఈ జోడి ఆడియన్స్ కి సుపరిచితమే. ఐతే రీసెంట్ గా ఈ జోడి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. "హ్యాపీ బర్త్ డే చిన్ని" 33 వ పుట్టినరోజున నా జీవితంలో మర్చిపోలేని బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావ్. ఫిబ్రవరి 12 నా మాకు బిడ్డ పుట్టింది. రెండు మనసుల కుటుంబం నుంచి ఇప్పుడు ముగ్గురం అయ్యాము. బేబీ జెండర్ ని త్వరలోనే రివీల్ చేస్తాం..మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.


 ఇక బుల్లితెర సెలబ్రిటీస్ అంతా అమ్మ, నాన్న ఐనందుకు  విషెస్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. వితిక షేరు, శ్రీప్రియ, సుష్మ కిరణ్, అనిల్ గీలా, అన్షు రెడ్డి, ప్రియాంక సింగ్, మెహబూబ్, తేజస్విని గౌడ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, యాంకర్ స్రవంతి చొక్కారావు, రవికృష్ణ, మహిశివన్, సిరి హన్మంత్, భానుశ్రీ, పగలు పవిత్ర, రోహిణి, చైత్ర రాయ్, ఆర్జే కాజల్, నటి జ్యోతి కంగ్రాట్యులేషన్స్ చెప్పిన వారిలో ఉన్నారు. పదేళ్లుగా పిల్లల కోసం చూస్తున్నామంటూ శివజ్యోతి గతంలో చాల సార్లు చెప్పింది ఇక ఇప్పుడు తన పుట్టినరోజు నేపథ్యంలో బిడ్డ పుట్టడం ఆనందంగా ఉందంటూ ఈ పోస్ట్ లో పేర్కొంది.


  

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.