వైరల్ అవుతున్న సుధీర్ వాయిస్ నోట్.. ఏముంది అందులో..
on Feb 15, 2026

ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్ మీద ఎన్నో షోస్ టెలికాస్ట్ అయ్యాయి. అందులో సర్కార్ షో ది స్పెషల్ ప్లేస్. ఇక త్వరలో మరో కొత్త సీజన్ సర్కార్ సీజన్ 6 రాబోతోంది. దానికి సంబంధించి సుధీర్ మాట్లాడిన ఒక ఆడియో నోట్ ని ఆహా రిలీజ్ చేసింది. "గ్రేస్ కా బాప్ ఎంటర్టైన్మెంట్ లో టాప్. డ్రామా లేదు ఓన్లీ డామినేషన్. అందరూ ఎదురు చూసే తిరుగులేని సెలబ్రేషన్. ది ఓజి ఆఫ్ గేమ్ షోస్. ది సర్కార్ ఈజ్ బ్యాక్." అంటూ చెప్పాడు. ఇక ఆహా ఐతే "మా సర్కార్ ఫాన్స్ అందరికీ సుధీర్ నుంచి ఒక స్పెషల్ వాయిస్ నోట్. బిగ్ అప్ డేట్ ఈజ్ రెడీ" అంటూ రాసింది.
సర్కార్ 2021 లో ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్ మీద స్టార్ట్ అయ్యింది. అలా ఇప్పటికి 5 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. సీజన్ 1, 2, 3 కి ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవరించారు. తర్వాత 4 ,5 సీజన్స్ కి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేసాడు. ఇక త్వరలో రాబోయే సీజన్ 6 కి కూడా హోస్ట్ సుధీర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆడియన్స్ కూడా సుధీర్ అన్న షో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సుధీర్ ఇప్పటికే ఆట షోకి హోస్ట్ గా చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



