సుధీర్ కి ప్రపోజ్ చేసింది...రష్మీనా?
on Jul 12, 2025
.webp)
సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ముందుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ వచ్చారు. రాగానే ప్రేమలో మునిగి తేలిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చి ప్రేమ, ప్రేమ మాటలు, ప్రేమ గులాబీలు ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక షో అన్న విషయం మర్చిపోయి ప్రేమలో డాన్సుల్లో మునిగి తేలుతున్న వీళ్లకు బ్రేక్ వేస్తూ సుధీర్ వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇక ఆ గులాబీని శివ్ ప్రియాంకకు ఇచ్చి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు ప్రేమలో మునిగితేలుతున్న టైంలో సుధీర్ అబ్బా అనుకున్నాడు. "కెమిస్ట్రీ అనేది నాకు అర్ధం కావట్లేదు" అని సుధీర్ శివ్ ని అడిగాడు.
"కెమిస్ట్రీ మేము మీకు నేర్పించడం ఏంటి సర్.. మిమ్మల్ని చూసే మేము ఇక్కడ కెమిస్ట్రీ నేర్చుకున్నాం" అని రివర్స్ లో కౌంటర్ వేసాడు శివ్. "అదంతా అప్పుడు సర్..ఇప్పుడు నేను కంప్లీట్ గా మారిపోయాను సర్" అని చేతులు కట్టుకుని మరీ సుధీర్ చెప్పాడు. "మీరు ఇన్నేళ్ల నుంచి లవ్ లో ఉన్నారు" అంటూ ప్రియాంక జైన్ సుధీర్ ని చాలా స్లోగా అడిగింది. సుధీర్ ఆలోచిస్తుండగా అతని ఆన్సర్ ని శివ్ చెప్పేసాడు. "నేను చెప్పాల్సిన అవసరం ఉందా అందరికీ తెలిసిందే కదా" అనేసరికి సుధీర్ కూడా ఒక రేంజ్ లో శివ్ వైపు చూసాడు. "మీరు ఆవిడ కోసం ఏమన్నా చెప్పాలి అంటే ఎం చెప్తారు" అని సుధీర్ శివ్ ని అడిగాడు. వెంటనే శివ్ మోకాళ్ళ మీద కూర్చుని ఒక మోకాలి మీద ప్రియాంకను కూర్చోబెట్టుకున్నాడు. "నేను కూడా ప్రతీ రోజు అడిగే ప్రశ్న అదే ప్రియాంకను ఎప్పుడు పెళ్లి అనేది" అన్నాడు. "2026 " అని చెప్పింది ప్రియాంక. ఇంతలో శివ్ "ఒక్క నిమిషం లే" అంటూ కాళ్ళు పట్టేసిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. "ఏవండీ ప్రియాంకను మోకాళ్ళ మీద రెండు నిముషాలు మోయలేకపోయారు పెళ్ళెప్పుడు అని అంటున్నారు" అన్నాడు కౌంటర్ గా సుధీర్. "మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారండి" అంటూ శివ్ సుధీర్ ని అడిగాడు. "తనే ప్రపోజ్ చేసింది" అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. మరి ఇంతకు ప్రపోజ్ చేసింది రష్మీనా ఇంకెవరన్ననా చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



