ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2: పారిజాతాన్ని ఇరికించిన కార్తీక్.. జ్యోత్స్న కి టెన్షన్!

on Feb 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-592లో.. సుమిత్ర, దశరథ్, శివన్నారాయణ, జ్యోత్స్న, పారిజాతం , కార్తీక్, దీప అందరు కలిసి మాట్లాడుకుంటారు. సాంపిల్స్ మ్యాచ్ అవ్వవని నీకు ముందే తెలిసిందా అని పారిజాతాన్ని కార్తీక్ అంటాడు. అలా కాదు, మొదటగా సాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న నా కూతురు.. తన వల్లే నాకు మళ్ళీ జీవితం మీద ఆశ కలిగింది.. ఇక నాకేం కాదు.. నేను కొలిచే అమ్మవారే నా కూతురు రూపంలో వచ్చిందని జ్యోత్స్నని ఉద్దేశ్శించి సుమిత్ర హ్యాపీగా అంటుంది. రోజు ఉదయం నన్ను నిద్రలేపుతావా అని జ్యోత్స్నని సుమిత్ర అడుగుతుంది. ఎందుకు కొత్తగా అని దశరథ్ అడుగుతాడు.

నా కూతురు నాకు ప్రాణం పోస్తుంది. రోజు లేవగానే దేవతని చూడటం అలవాటు కానీ ఈ రోజు నుండి జ్యోత్స్ననే చూస్తానని సుమిత్ర అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు స్వప్న లగేజీతో బయటకు వచ్చి కాశీ ఉంటే నేను ఇంట్లో ఉండనని స్వప్నని కన్విన్స్ చేస్తాడు శ్రీధర్. మరోవైపు కార్తీక్ మాత్రం బయటకు వస్తాడు. కార్తీక్ ని చూసి దీప కూడా బయటకు వస్తుంది. ఏమైంది బావ అని దీప అడుగగా.‌ నాకు రగిలిపోతుంది. అసలు కూతురే కాని జ్యోత్స్నని దేవత అని, నిన్ను ఓ పనిమనిషిని చూసినట్టు చూస్తుంటే నా వల్ల కావట్లేదు దీప అని కార్తీక్ కోపంగా ఉంటాడు. మనం ఏం చేయగలం బావ అని కార్తీక్ అంటాడు. నీకొక విషయం చెప్పాలని కార్తీక్ అనగానే ఏంటని దీప అడుగుతుంది. ఇందాక మాట్లాడేటప్పుడు పారు గన్ తీసుకొచ్చింది. తను గన్ పడేస్తే జ్యోత్స్న తీసి దాచిపెట్టిందని కార్తీక్ అంటాడు. ఎందుకని అని దీప అనగానే ఎవరినో చంపడానికి అని కార్తీక్ అంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి బావ అని దీప అంటుంది. అప్పుడే కార్ లో శ్రీధర్, కాంచన వస్తారు. అమ్మనాన్న ఎందుకు వచ్చారని కార్తీక్ అంటాడు.

నాన్న ఫోన్ చేసి రమ్మన్నారని కాంచన అంటుంది. పదండి లోపలికి అని నలుగురు వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే అందరు హ్యాపీగా ఉంటారు. మనమందరం టూర్ కి వెళదామని శివన్నారాయణ అనగానే మరి నేను వద్దా మామయ్య అని శ్రీధర్ అంటాడు. అయ్యో మీరు లేకుండా ఎలా అని శివన్నారాయణ అంటాడు. ఇక కాంచనకి స్వీట్ తినిపించమని సుమిత్రకి చెప్తాడు శివన్నారాయణ. ఎందుకని కాంచన అడుగుతుంది. జ్యోత్స్న సాంఫిల్స్ మ్యాచ్ అయ్యాయని శివన్నారాయణ అనగానే కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ‌మరి జ్యోత్స్న ఎందుకు టెన్షన్ గా ఉంది అని శ్రీధర్ అంటాడు. లేదని తను అనగానే నీ మొహంలో స్పష్టంగా తెలుస్తుందని శ్రీధర్ అంటాడు. అమ్మ ఒకసారి కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగింది. అప్పుడే తను తట్టుకోలేదు.. ఇప్పుడు ఆపరేషన్ అంటే స్కిన్ కోస్తారు.. ఎలా తట్టుకుంటుందో ఏమో అందుకే బాధగా, టెన్షన్ గా ఉందని జ్యోత్స్న అంటుంది. ఇక అది విని కార్తీక్ క్లాప్స్ కొడతాడు. ఎందుకురా చప్పట్లు అని పారిజాతం అడుగగా నవరసాల్లో కరుణ రసం బాగా చేసింది జ్యోత్స్న.. తనకి ఎంతైనా తక్కువే అని కార్తీక్ అంటాడు. మరి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారని  పారిజాతాన్ని శ్రీధర్ అడుగుతాడు. ఏదో క్లారిటి మిస్ అయిందని పారిజాతం అంటుంది. కూల్ డ్రింక్స్ తాగేసాక దాని గురించి మాట్లాడదామని చెప్తాడు శ్రీధర్. ఇక దీప అందరికి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. మాస్టారు నువ్వు ఇందాక ఎక్కడో ఆపినట్టున్నావు అని కార్తీక్ అనగానే పారిజాతం టెన్షన్ పడుతుంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.