‘శిఖా వీరగోని’వచ్చేసింది.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ జంట
on Dec 9, 2025

బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా ఆకుల ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. సోనియా - యష్ జోడి కలిసి ఇష్మార్ట్ జోడికి వచ్చి మంచి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో బాగా ఫెమిలియర్ పర్సన్స్ కూడా. బిగ్ బాస్ లో పృద్విని, నిఖిల్ చిన్నోడు పెద్దోడు అంటూ వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉండగా యష్ తో తన లవ్ గురించి చెప్పింది. తర్వాత హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. తమకు పండంటి ఆడపిల్ల పుట్టిందని "శిఖా వీరగోని" మా ఇంటికి వచ్చేసింది అంటూ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. యష్ కి ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు ఉన్నాడు. అతని పేరు విరాట్ వీరగోని. సోనియా ఆకుల టాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించింది "జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్" వంటి మూవీస్ లో నటించింది.
ఇక వాళ్ళ ఫాన్స్, సెలబ్రిటీస్ అంతా కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు. 2024 డిసెంబర్ 21 న యష్ - సోనియా పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా మళ్ళీ ఏడాదికి వీళ్లకు పాప పుట్టింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాక కొన్ని ఇంటర్వ్యూస్ లో హోస్ట్ నాగార్జున వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ కి మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళను అంటూ కూడా చెప్పేసింది. యష్ ఐతే ఫ్లై హై టూరిజం, విరాట్ ఫౌండషన్స్ వంటివి స్థాపించాడు. అమెరికాలో దావత్ పేరుతో కొన్ని రెస్టారెంట్స్ కూడా నడుపుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



