Karthika Deepam2 : జ్యోత్స్నని నిలదీసిన శివన్నారాయణ.. కాంచన వెళ్తుందా!
on Jan 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -573 లో..... సుమిత్ర డల్ గా ఉందని కార్తీక్ తన చిన్నప్పటి ఫోటోని సుమిత్రకి పంపిస్తాడు. అది చూసి సుమిత్ర నవ్వుతుంది. కార్తీక్ చిన్నప్పుడు అమ్మాయి గెటప్ లో ఉన్న ఫోటో.. దాన్ని చూసి ఇంట్లో వాళ్లంతా నవ్వుతారు. ఆ ఫోటో వెనకాల పెద్ద కథ ఉందని సుమిత్ర అంటుంది. ఏంటి అది అని దీప అడుగుతుంది. అత్త చెప్పొద్దని కార్తీక్ అంటాడు. చెప్తానంటూ ఆ ఫోటో వెనకాలున్న స్టోరీని సుమిత్ర చెప్తూ నవ్వుతుంది. చాలా రోజులకి మీ అత్త నవ్వుతుంది రా థాంక్స్ అని కార్తీక్ కి దశరథ్ చెప్తాడు.
ఎక్కడ సాంపిల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ వస్తే నిజం బయటపడుతుందోనని జ్యోత్స్న భయపడుతుంటే అప్పుడే పారిజాతం వస్తుంది. నేను నీ గురించి ఉహించుకున్న నిర్మాణం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేను కానీ ఏం చేయాలో తెలియడం లేదని పారిజాతం అంటుంది. మరొక వైపు కార్తీక్ డబ్బు లెక్కేస్తే ఇది అమ్మకి ఇవ్వు అంటాడు. అప్పు చేసావా బావ అని దీప అడుగుతుంది. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేనని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అమ్మ గురించి భయం వేస్తుంది. జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ కావని కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే అప్పుడే కాంచన ఎంట్రీ ఇచ్చి ఎందుకు మ్యాచ్ కావని అడుగుతుంది. మరొక వైపు సుమిత్ర ఇంకా భోజనం చేయకుండా, ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటే తనపై దశరథ్ కోప్పడతాడు.
అప్పుడే జ్యోత్స్నని శివన్నారాయణ పిలిచి.. అసలు నువ్వు నా మనవరాలు కావు.. సుమిత్ర కూతురు కాదు అనగానే రిపోర్ట్స్ వచ్చి అలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు టెన్షన్ పడుతారు. అసలు మీ అమ్మ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని క్లాస్ తీసుకుంటాడు శివన్నారాయణ. దీని గురించా అని ఇద్దరు రిలాక్స్ అవుతారు. మరొకవైపు జ్యోత్స్న సాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావని కాంచన అడిగి ప్రశ్నకి కార్తీక్ కవర్ చేసి సమాధానం చెప్తాడు. అప్పుడే శివన్నారాయణ కార్తీక్ కి ఫోన్ చేసి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు అంటాడు. నువ్వు సుమిత్ర మంచి స్నేహితులు నువ్వు ఇక్కడ ఉంటే మాట్లాడుకుంటూ సరదాగా ఉంటారు ఇక్కడికి రమ్మని చెప్తాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ తీసుకుంటాడు. దశరథ్ మాట్లాడుతాడు. ఒరేయ్ కార్తీక్ ఇంట్లో అందరిని తీసుకొని రా అనగానే కార్తీక్ సరే అంటాడు. నేను రాలేను వదినని ఆ పరిస్థితిలో చూస్తూ ఉండలేనని కాంచన అనేసి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



