మాకు ఆడపిల్ల పుట్టిందోచ్.. వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మహాలక్ష్మి!
on Feb 15, 2026

జ్యోతక్క అలియాస్ శివ జ్యోతి రీసెంట్ గా ఫిబ్రవరి 12 న ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఐతే ఆ బిడ్డ ఆడపిల్లనా, మగపిల్లాడా అన్న విషయాన్నీ మాత్రం సీక్రెట్ గా ఉంచారు. ఐతే ఇప్పుడు ఆ విషయాన్నీ రివీల్ చేశారు. పింక్ అండ్ బ్లూ బెలూన్స్ ని పగలగొట్టి చివరికి ఒక పింక్ బెలూన్ ని ఉంచి "ఇట్స్ ఏ బేబీ గర్ల్" అంటూ అనౌన్స్ చేశారు.
అలాగే శివజ్యోతి ఒక పోస్ట్ ని పెట్టింది. "నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం...నా స్వామి ఇచ్చిన మహాలక్ష్మి...నా పుట్టినరోజు నాడు జీవితాంతం మర్చిపోలేకని ఒక బహుమతిని ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి.
బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల. అన్ని కోరికలలోకి ఒక అమ్మాయిని కనాలి అనేది నా కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను భావిస్తూ వచ్చాను ఇన్నాళ్లు. ఆయన తన ఆశీర్వాదాన్ని ఇవ్వడం లేట్ అయిందేమో కానీ సరైన సమయంలో మంచి బహుమతిని ఇచ్చాడు.
నెల తప్పిన దగ్గర నుంచి ఆడపిల్ల పుడితే బాగుండు అనుకునేదాన్ని. కానీ నా మనస్సు "అబ్బాయి పుడతాడేమో" అని చెప్పేది. ఇక డెలివరీకి రెండు రోజుల ముందు నా మనసు ఎందుకో మారిపోయింది. మాకు ఆడపిల్లే పుట్టబోతోంది అన్న విషయాన్ని ఊహించాను.
ఈ రోజు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, ఈ విశ్వం, ఈ ప్రకృతి వీటి దయతో... మాకు అందమైన ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు గంగూలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి. అతనిది ఎప్పుడు పెద్దమనిషి స్వభావం, అతని స్వచ్ఛమైన మనసే. మాకు ఒక ఆడపిల్ల పుట్టినందుకు గర్వపడుతున్నాం. నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాము." అంటూ తన బేబీ గర్ల్ గురించి జ్యోతక్క ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



